Most Recent

Tollywood: రజినీకాంత్ పక్కన ఉన్న ఈ అబ్బాయిని గుర్తుపట్టగలరా..? ఒక్క సినిమాతోనే తమిళ్, తెలుగులో తోపు హీరోగా క్రేజ్..

Tollywood: రజినీకాంత్ పక్కన ఉన్న ఈ అబ్బాయిని గుర్తుపట్టగలరా..? ఒక్క సినిమాతోనే తమిళ్, తెలుగులో తోపు హీరోగా క్రేజ్..

సూపర్ స్టార్ రజినీకాంత్ కు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో రజినీ పక్కన ఉన్న కుర్రాడిని గుర్తుపట్టగలరా.. ? ఒక్క సినిమాతోనే అటు తమిళంలో.. ఇటు తెలుగులో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. తమిళం భాషలో పలు సినిమాల్లో నటించిన ఈ హీరో.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. తమిళంలో దాదాపు40కి పైగా చిత్రాల్లో నటించారు. అతని తండ్రి, ఆర్‌బి చౌదరి తమిళ సినిమాల్లోని ప్రముఖ నిర్మాతలలో ఒకరు. అతడు మరెవరో కాదండి.. కోలీవుడ్ హీరో జీవా. ఈ పేరు చెబితే గుర్తపట్టకపోవచ్చు.. అదెనండీ.. రంగం సినిమాతో తెలుగులోనూ ఫేమస్ అయిన హీరో.

రామ్, కో, నీతానే ఎన్ పొన్వసంతం చిత్రాలలో జీవా తన నటనా నైపుణ్యంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. చిన్న వయసులోనే తన తండ్రి నిర్మించిన సినిమాల్లో అతితి పాత్రలు పోషించారు. 1991లో కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన చేరన్ పాండియన్ అనే చిత్రంలో కనిపించాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు జీవా తండ్రి ఆర్ బీ చౌదరి. తండ్రి తెలుగు నిర్మాత అయినప్పటికీ తమిళంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు జీవా. 2003లో ఆసే ఆసే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

జీవ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. గతంలో ఆయన నటించిన రంగం సినిమా అటు తమిళంతోపాటు ఇటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో మ్యూజికల్ గానూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో కాకుండా తమిళంలోనే ఫేమస్ అయ్యాడు జీవ. ఇక కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ బయోపిక్ యాత్ర 2లోనూ కనిపించాడు. ఇందులో జగన్ పాత్రలో ఒదిగిపోయాడు జీవ. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ హీరో.

 

View this post on Instagram

 

A post shared by Jiiva (@actorjiiva)

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.