
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అభిమానులు సోమవారం (మే 5) ఒక్క క్షణం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉపేంద్ర ఆరోగ్యం క్షీణించిందని వార్తలు రావడంతో కంగారు పడ్డారు. దీనికి తోడు ఉప్పీ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. దీంతో అభిమానులు బాగా టెన్షన్ పడ్డారు. అయితే కొద్ది గంటల్లోనే ఉప్పీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇది విన్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఉపేంద్ర గత కొన్ని రోజులుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ‘UI’ సినిమా షూటింగ్ సమయంలోనూ ఉపేంద్ర ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. ‘బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఉపేంద్ర ఇంటికి తిరిగి వచ్చాడు. అతని ఆరోగ్యం మెరుగుపడింది కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఉప్పీ సన్నిహితులు తెలిపారు.
ఇక కొద్ది సేపటికే ఉపేంద్ర కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.. ‘అందరికీ నమస్కారం.. నేను ఆరోగ్యంగా ఉన్నాను.. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం మాత్రమే నేను ఆసుపత్రికి వెళ్లాను. అంతే తప్ప.. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు విని అభిమానులు ఏ మాత్రం ఆందోళన చెందవద్దు. మీ ప్రేమ, అభిమానానికి నా ధన్యవాదాలు’ అని ఉపేంద్ర ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు కూల్ అయ్యారు.
ఉపేంద్ర ట్వీట్..
ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ.. ನಾನು ಆರೋಗ್ಯವಾಗಿದ್ದೇನೆ.. ರೆಗ್ಯುಲರ್ ಚೆಕ್ ಅಪ್ ಗಾಗಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿದ್ದೆ ಅಷ್ಟೇ.. ಯಾವುದೇ ಊಹಾ ಪೋಹ ಗಳಿಗೆ ಕಿವಿಕೊಟ್ಟು ಗೊಂದಲಕ್ಕಿಡಾಗಬೇಡಿ.. ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಕಾಳಜಿಗೆ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು
— Upendra (@nimmaupendra) May 5, 2025
ఉపేంద్ర ప్రస్తుతం అర్జున్ జన్య దర్శకత్వం వహించిన ’45’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. చిత్ర బృందం దాని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. దీంతో పాటు రజనీకాంత్ నటిస్తున్న తమిళ చిత్రం ‘కూలీ’లో ఉపేంద్ర ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
45 మూవీ ప్రమోషన్లలో ఉపేంద్ర..
Malayalam cinema is on fire lately! Films like Aavesham, Manjummal Boys, and Officer on Duty have totally surprised and impressed us!
We try not to miss a single release these days
Kannada legends Siva Rajkumar & Upendra at the grand 45 Movie Malayalam teaser launch… pic.twitter.com/BETwY7Lw80— Rajesh Sundaran (@editorrajesh) April 16, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.