
పై ఫొటోల్లో కృష్ణుడి వేషంలో ఉన్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించింది. తన క్యూట్ యాక్టింగ్ తో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. యూట్యూబ్ సిరీసుల్లోనూ నటించి మెప్పించిన ఈ అందాల తార ఓ బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె మెయిన్ హీరోయిన్ కాకపోయినా తన పాత్రకు కూడా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ తళుక్కుమంది. అయితే తనను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ తోనే ప్రేమలో పడిందీ అందాల తార. పెద్దల ఆశీర్వాదంతో అతనితో కలిసి ఏడడుగులు వేసింది. గతేడాది తిరుమల శ్రీవారి సాక్షిగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు సుహాస్, వైవా హర్ష తదితర సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార తాజాగా కృష్ణుడి వేషంలో కనిపించింది. ఓ కార్యక్రమంలో భాగంగా ఇలా కృష్ణుడి వేషంలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. మరి ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు కలర్ ఫొటో ఫేమ్ చాందినీ రావు. అదే నండి డైరెక్టర్ సందీప్ రాజ్ భార్య.
గతేడాది డిసెంబర్ లో సందీప్ రాజ్- చాందినీ రావుల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు తమ ప్రొఫెషనల్ లైఫ్ తో బిజీగా ఉంటున్నారు. డైరెక్టర్ సందీప్ రాజ్ ప్రస్తుతం మోగ్లీ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఓ వైపు డైరెక్టర్ గా కొనసాగుతూనే నటుడిగానూ మెప్పిస్తున్నాడు సందీప్ రాజ్. అందులో భాగంగానే బాలయ్య డాకు మహారాజ్ లో విలన్ గా అదరగొట్టాడు. అంతుకు మందు సీతారామం, మిషన్ ఇంపాజిబుల్, ఆర్ డీఎక్స్ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు.
కృష్ణుడి వేషంలో చాందినీ రావు..
View this post on Instagram
హీరో నాని దంపతులతో సందీప్ రాజ్- చాందినీ రావు..
View this post on Instagram
సందీప్ రాజ్- చాందినీ రావు పెళ్లి ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.