
సినిమా హీరోలు, హీరోయిన్లు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. ఈ కారణంగానే వారు ప్రతిరోజూ జిమ్‌లో కఠిన వ్యాయామాలు, వర్కవుట్లు చేస్తారు. ఆహారంపై కూడా నియంత్రణ పాటిస్తూ నోరు కట్టేసుకుంటారు. అయితే అన్ని వేళలా ఇవి సాధ్యం కాకపోవచ్చు. ఫలితంగా ఉన్నట్లుండి బరువు పెరగుతారు. ముఖ్యంగా నడుము ప్రాంతంలో కొవ్వు పేరుకుపోతుంది. అప్పటిదాకా ముద్దుగుమ్మగా కనిపించిన వారు బొద్దుగుమ్మగా మారొచ్చు. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కు ఇదే జరిగింది. ఆమె అద్దంలో తన పొట్టను చూసి షాక్ అయ్యింది. తానేందుకిలా మారిపోయానంటూ ఆలోచించింది. అంతే తన వెయిట్ లాస్ జర్నీ ప్రారంభించింది. గతంలోలా మళ్లీ నాజుకుగా, సన్నగా మారాలని కంకణం కట్టుకుంది. మొదలుపెట్టింది. కేవలం మూడే మూడు నెలల్లో తాను అనుకున్నది సాధించంది. శరీరంలో కొవ్వును అలాగే బరువును తగ్గించుకుంది. ఇప్పుడు గతంలో లాగే మళ్లీ ముద్దుగుమ్మగా మారిపోయింది. ఇలా తన వెయిట్ లాస్ జర్నీతో అందరిలోనూ స్ఫూర్తినింపిన ఈ హీరోయిన్ మరెవరో కాదు వెంకటేష్ హీరోగా తెరెక్కిన గురు సినిమాలో కథానాయికగా నటించిన రితికా సింగ్.
రితిక ముంబైలో జన్మించింది. 2016 లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ సినిమాల్లో నటించింది. తెలుగులో గురు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత సంవత్సరం విడుదలైన రజనీ కాంత్ ‘వేట్టయన్’ సినిమాలో రితిక ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత, రితిక కొంత విరామం తీసుకుంది. ఆమె నటించిన ఏ సినిమా కూడా విడుదల కాలేదు. ఈ కాలంలోనే రితిక తన ఆకారాన్ని పూర్తిగా కోల్పోయింది. బరువు బాగా పెరిగింది.
రితికా సింగ్ షేర్ చేసిన వీడియో..
View this post on Instagram
‘గత మూడు నెలల‍్ని నా జీవితంలో అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పటివరకు లేనంతగా బరువు పెరిగాను. మరో వైపు మోకాళ్ల నొప్పితో నా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అసలు నొప్పి తట్టుకోలేకపోయాను. కనీసం కదల్లేకపోయాను. డ్యాన్స్ కూడా చేయలేకపోయాను. దీంతో నన్ను నేను ఓసారి అద్దంలో చూసి.. ఇక చాలు అని నాతో నేనే చెప్పుకొన్నా. ఇక ఫుడ్ తో నా రిలేషన్ షిప్ విషయానికొస్తే ఇప్పుడు చాలా చెడు అలవాట్లని నా కంట్రోల్ లో పెట్టుకున్నాను. దీని కోసం చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. ‘ అని రితికా సింగ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
రితికా సింగ్ డ్యాన్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.