Most Recent

Ram Charan: మై డియర్ నాని నీకు హాట్యాఫ్.. హిట్ 3 పై రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్..

Ram Charan: మై డియర్ నాని నీకు హాట్యాఫ్.. హిట్ 3 పై రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్..

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ సినిమా హిట్ 3. డైరెక్షన్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో రికార్డ్స్ సృష్టిస్తుంది. ఈ సినిమాకు మొదటి రోజు నుంచే భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. మే 1న విడుదలైన ఈ సినిమా గత మూడు రోజులుగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలోనూ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. రెడు రోజుల్లోనే ఈ చిత్రానికి రూ.62 కోట్లకుపైగానే వసూళ్లు వచ్చాయి. ఇక ఇప్పుడు శని, ఆదివారాల్లో ఈ సినిమాకు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందులో నాని సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. తాజాగా ఈ మూవీపై మెగా హీరో రామ్ చరణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అలాగే ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటున్న నానిపై ప్రశంసలు కురిపించారు.

“హిట్ 3 సినిమాకు అద్భుతమైన రివ్యూస్ వస్తున్నాయని తెలిసింది. మై డియర్ బ్రదర్ నాని… యూనిక్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసి హిట్స్ కొడుతున్నందుకు నీకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తీసిన శైలేష్ కొలనుకు కూడా హ్యాట్సాఫ్.. శ్రీనిధి శెట్టి, ప్రశాంతి త్రిపర్నేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ సినిమా టీంకు శుభాకాంక్షలు” అంటూ నానితోపాటు హిట్ 3 చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు రామ్ చరణ్. గతంలో వచ్చిన హిట్, హిట్ 2 చిత్రాలు సైతం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన హిట్ 3 చిత్రంలో ఇప్పటివరకు ఎన్నడూ కనిపించని పాత్రలో మోస్ట్ వయెలెన్స్ హీరోగా కనిపించాడు నాని. అర్జున్ సర్కార్ పాత్రలో భయపెట్టాడు. ఇందులో నాని నెవర్ బిఫోర్ యాక్షన్ మోడ్ లోకి దిగిపోయారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా.. రావు రమేశ్, బ్రహ్మాజీ, మాగంటి స్రీనాథ్ కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.