Most Recent

OTT Movie: అనుక్షణం ఉత్కంఠ.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు మావ.. సండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో ఎంజాయ్ చేసేయండి..

OTT Movie: అనుక్షణం ఉత్కంఠ.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు మావ.. సండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో ఎంజాయ్ చేసేయండి..

ఓటీటీలో రెగ్యులర్ గా సరికొత్త కంటెంట్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు డిజిటల్ అడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్న కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందామా. తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ రూపొందించిన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సామాజిక సమస్యలు, అసమానతలు, అన్యాయలను తన సినిమాల్లో ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. మనసులను బలంగా తాకేలా, ఆలోచనలను కలిగించేలా సినిమాలు రూపొందించడం వెట్రిమారన్ స్టైల్. అందుకే ఆయన చిత్రాలకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా..

అసురన్..
కోలీవుడ్ ధనుష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించిన సినిమా అసురన్. 2019లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు.. ధనుష్ ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

వడా చెన్నై…
మరోసారి ధనుష్, వెట్రిమారన్ కాంబోలో వచ్చిన చిత్రం వడా చెన్నై. 2018లో విడుదలైన ఈ సినిమాలో ఆండ్రియా జెమీయా, అమీర్, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. రెండు గ్రూప్స్ మధ్య గొడవల్లో క్యారమ్ ప్లేయర్ అన్బు చిక్కుకోవడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

విసారనై..
చేయని నేరానికి నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఇందులో కోలీవుడ్ యంగ్ స్టర్స్ నటించారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఆడుకాలం..
వెట్రిమారన్ డైరెక్షన్ లో ధనుష్ నటించిన మూడో సినిమా ఆడుకాలం. 2010లో విడుదలైన ఈ సినిమాలో తాప్సీ, కిశోర్ , జయపాలన్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే సహా మొత్తం ఆరు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు.

విడుదలై పార్ట్ 1..
సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా విడుదలై పార్ట్ 1. రస్టిక్ గా క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ జీ3, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

విడుదలై పార్ట్ 2…
మొదటి భాగానికి కొనసాగింపుగా గతేడాది వచ్చిన సినిమా విడుదలై పార్ట్ 2. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

పొల్లధవన్..
ధనుష్, వెట్రిమారన్ కాంబోలో వచ్చిన మరో సినిమా పొల్లధవన్. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.