
గతంలో సూపర్ హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన లేటేస్ట్ మూవీ ఓదెల 2. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజుల తర్వాత ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా ఇది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో మంచి క్యూరియాసిటీ కలిగించిన ఈ సినిమా థియేటర్లలో మాత్రం మెప్పించలేకపోయింది. డైరెక్టర్ సంపత్ నంది కథ అందించగా.. డైరెక్టర్ అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8 అర్ధరాత్రి నుంచి తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులోకి వచ్చేసింది.
చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో తమన్నా ప్రధాన పాత్ర పోషించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బడ్జెట్ లో సగం కూడా వసూలు చేయలేకపోయింది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. మైథలాజికల్, హారర్ జానర్ కలిపి ఈ చిత్రాన్ని రూపొందించారు. తొలి సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ చేశారు. పెళ్లైన ఆడవాళ్లపై పాశవికంగా దాడి చేసే ఓ సైకో చనిపోయి ప్రేతాత్మగా మారితే ఎలా ఉంటుంది ? అనే కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇందులో తమన్నా నాగసాధువుగా నటించగా… వశిష్ట కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమా థ్రిల్లర్ జానర్ కావడంతో.. కథకు తగినట్లుగా అందించిన మ్యూజిక్ హైలెట్ అయ్యింది. రూ.25 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్స్ దాదాపు రూ.6 కోట్లు సైతం దాటలేదు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..