Most Recent

ఆపరేషన్ సింధూర్‌కు అండగా కదులుతున్న యావత్ భారతావని.. సైన్యానికి ఉడతాభక్తిగా సాయం!

ఆపరేషన్ సింధూర్‌కు అండగా కదులుతున్న యావత్ భారతావని.. సైన్యానికి ఉడతాభక్తిగా సాయం!

భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ.. భారత సైన్యం చూపుతున్న ధైర్య సాహసాలు, జవాన్ల పరాక్రమాలను యావత్ దేశం కీర్తిస్తోంది. శత్రు దేశం గడ్డ మీదకు వెళ్లి మరీ మనోళ్లు చూపుతున్న సత్తాను కొనియాడుతోంది. భారత సైన్యం శక్తిని తట్టుకోలేక.. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న శత్రు మూకలను బోర్డర్‍లో నిలిపేస్తున్న జవాన్లు కోసం ప్రముఖులు ఉడతాభక్తిగా విరాళంగా అందిస్తున్నారు.

భారత్- పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో శత్రుమూకల కుట్రలను భగ్నం చేస్తూ జాతి రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికుల పోరాడుతున్నారు. ప్రతి భారతీయుడు గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా పడుకునేందుకు.. నిద్రాహారాలు మాని.. జాతి రక్షణే పరమావధిగా, ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాటం చేస్తున్న జవాన్లకు దేశం మొత్తం మద్దతుగా నిలుస్తోంది. వారి కోసం పలు రంగాల్లోని ప్రముఖులు ఒక్కొక్కరుగా కదిలి వస్తున్నారు.

పాక్ దుస్సాహసంపై విరోచితంగా పోరాడుతన్న భారత సైన్యానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కి తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ ఒక నెల జీతాన్ని విరాళంగా అందించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీలంతా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని కోరారు.

భార‌త సైన్యానికి విరాళాల రూపంలో త‌మ‌ వంతు సాయం చేసేందుకు సినీ నిర్మాత అల్లు అర‌వింద్ ముందుకు వ‌చ్చారు. సింగిల్ మూవీ క‌లెక్షన్స్ నుంచి కొంత భాగాన్ని భారత సైనికుల‌కు విరాళంగా ఇస్తున్నామ‌ని ప్రక‌టించారు. హీరో విజయ్ దేవరకొండ కూడా రాబోయే కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాని భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అటు మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ట్రక్ ఆపరేటర్లు, రవాణా సంఘాలు భారత సైన్యానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి 7.5 లక్షల ట్రక్కులను ఉచితంగా పంపడానికి ముందుకొచ్చాయి. ఈ మేరకు మధ్యప్రదేశ్ ట్రక్ ఆపరేటర్, ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదకి ఒక లేఖ రాసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.