Most Recent

ఈ క్యూట్ కుట్టిని గుర్తుపట్టారా.? అందంలో అప్సర ఈ భామ.. సినిమాలు మానేసి ఇప్పుడేం చేస్తుందంటే

ఈ క్యూట్ కుట్టిని గుర్తుపట్టారా.? అందంలో అప్సర ఈ భామ.. సినిమాలు మానేసి ఇప్పుడేం చేస్తుందంటే

టాలీవుడ్‌లో కేవలం ఒక్క సినిమాతోనే క్రేజ్‌ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. హీరోయిన్స్ గానే కాదు మరికొంతమంది సెకండ్ హీరోయిన్స్ గానూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కాగా పై ఫొటోలో ఉన్న అమ్మాయి కూడా ఈ కోవకే చెందుతుంది. ఈమె తెలుగులో చాలా సినిమాలు చేసింది. కానీ తన పేరు వినిపిస్తే కేవలం ఒక్క సినిమానే గుర్తుకు వస్తుంది. అది కూడా హీరోయిన్‌గా కాదు. కేవలం స్పెషల్‌ రోల్‌తోనే బాగా క్రేజ్‌ తెచ్చుకుంది. తన చలాకీ నటనతో బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌గా ఫిల్మ్‌ ఫేర్‌కు నామినేట్‌ అయ్యింది. సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవ్వడంతో అవకాశాలు బాగా వచ్చాయి.

అయితే ఎందుకోగానీ ఆ తర్వాతి సినిమాలు పెద్దగా ఆడలేదు. అందుకే బుల్లితెరపై అడుగుపెట్టింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇదే షోలోనే ఒక యంగ్‌ సింగర్‌తో ప్రేమలో ఉందంటూ తెగ ప్రచారం కూడా నడిచింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. యస్‌ ఈ క్యూటీ మరెవరో కాదు.. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్‌ పునర్నవి భూపాళం.

ఉయ్యాల జంపాల తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఈ సినిమా సూపర్‌ హిట్‌ గ్యారెంటీ, పిట్టగోడ, మనసుకు నచ్చింది, ఎందుకో ఎమో, ఒక చిన్న విరామం, సైకిల్‌ వంటి సినిమాల్లో నటించింది పునర్నవి. అయితే ఇవి పెద్దగా ఆడలేదు. అయితే బిగ్‌బాస్‌ సీజన్‌ 3 అడుగుపెట్టిన తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది. తనదైన ఆటతీరుతో పాటు రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమలో ఉందన్న ప్రచారం ఆమెకు ఎనలేని క్రేజ్‌ను తీసుకొచ్చాయి. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోందీ అందాల తార. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోస్‌, వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తోంది.

Punarnavi Bhupalam

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.