
కొత్త సినిమాలు రిలీజ్ అయిన సాయంత్రానికే పైరసీ అయ్యి ఫోన్ లో వచ్చేస్తున్నాయి.. కానీ పాత సినిమాలు మాత్రం రీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో అదరగొడుతున్నాయి. నెలకు మూడు నాలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో సోసోగా ఆడుతుంటే.. రీరిలీజ్ సినిమాలు మాత్రం అదరగొడుతున్నాయి. ఇప్పటికే దాదాపు అందరు హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే రీరిలీజ్ సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషంగా రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు సినిమాలను ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే.. థియేటర్స్ లో సినిమాలోని సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు. మొదట్లో పాటలకు డాన్స్ లు వేసి వైరల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా యమదొంగ సినిమా రీ రిలీజ్ అయ్యింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియమణి, సింధుతులాని హీరోయిన్స్ గా నటించారు. భారీ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి థియేటర్స్ లో అదరగొడుతుంది. థియేటర్స్ లో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యమదొంగ సినిమాలో అలీ గెటప్ వేసుకొని హల్ చల్ చేశాడు.. మొనీమద్యే చిరంజీవి జగదేక వీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ లో ఓ వ్యక్తి విలన్ అమ్రిష్ పూరి గెటప్ వేసుకొని హంగామా చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అలానే ఇప్పుడు మరో వ్యక్తి యమదొంగ సినిమాలోని అలీ వేసిన వింత గెటప్ లో కనిపించాడు. వంటికి ఆకులు కట్టుకొని అలీని ఇమిటేట్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అలాగే ఇంకొంతమంది యముడి గెటప్ లో కనిపించి హడావిడి చేశారు. ఈ వీడియో వైరల్ అవుతున్నాయి.
#Yamadonga4K Ali Scene Recreated at Vizag melody Theatre
pic.twitter.com/VRChvZnFZu
— Nellore NTR Fans (@NelloreNTRfc) May 18, 2025
యమదొంగ రీ రిలీజ్..
@ sandya HYD
pic.twitter.com/VfN4vWlE9T
— WORLD NTR FANS (@worldNTRfans) May 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.