
బుల్లితెరపై సీరియల్స్‌కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఎక్కువగా చూసేది సీరియల్స్ మాత్రమే. ముఖ్యంగా ప్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు టీవీల్లో పదుల కొద్ది సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. ఇందులో నటించే నటీనటులకు సినీతారలకు మించిన ఫాలోయింగ్ వస్తుంది. అందం, అభియంతో టీవీ అడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇక సీరియల్స్ లో హీరోయిన్ రోల్స్ కాకుండా తల్లి, అత్త పాత్రలతో పాపులర్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. అయితే ఇన్నాళ్లు తల్లి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఓ నటి.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. బుల్లితెరపై మంచి రెస్పాన్స్ అందుకున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు ఒకటి. కొన్ని రోజుల క్రితం ఈ సీరియల్ కు శుభం కార్డ్ పడింది. ఇందులో వసుధార, రిషి పాత్రలతోపాటు ఈ సీరియల్లో రిషి తల్లిగా జగతి మేడమ్ పాత్ర సైతం అంతే ఫేమస్ అయ్యింది. జగతి మేడమ్ పాత్రలో జ్యోతిరాయ్ కనిపించిన సంగతి తెలిసిందే.
జగతి మేడమ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది జ్యోతిరాయ్. సంప్రదాయ కట్టుబొట్టుతోపాటు సహజమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జగతి మేడమ్ పాత్రతో తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యింది. ఈ సీరియల్ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. అయితే గుప్పెడంత మనసు సీరియల్లో తల్లి పాత్రలో ఎంతో పద్దతిగా కనిపించిన జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో ఊహించని లుక్ లో కనిపిస్తూ నెటిజన్లకు షాకిస్తుంది. నెట్టింట గ్లామర్ అరాచకం సృష్టిస్తోంది జ్యోతిరాయ్.
నిత్యం ఏదోక గ్లామర్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో మతిపోగొడుతుంది జ్యోతిరాయ్. గ్లామర్ షోకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా కుర్రహీరోయిన్లకు సైతం టెన్షన్ పుట్టిస్తోంది. ప్రస్తుతం జ్యోతిరాయ్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..