Most Recent

Shalini Pandey: ఓటీటీలో రచ్చ చేస్తోన్న అర్జున్ రెడ్డి హీరోయిన్ సినిమా.. ఊహించని ట్విస్టులు.. మెంటలెక్కించే సీన్స్..

Shalini Pandey: ఓటీటీలో రచ్చ చేస్తోన్న అర్జున్ రెడ్డి హీరోయిన్ సినిమా.. ఊహించని ట్విస్టులు.. మెంటలెక్కించే సీన్స్..

ప్రస్తుతం ఓటీటీలో హారర్, రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా దూసుకుపోతున్నాయి. కంటెంట్ బాగుండాలే కానీ చిన్న సినిమాలకు పట్టం కడుతున్నారు సినీప్రియులు. ఈమధ్య కాలంలో ఎక్కువగా ఆద్యంతం ఉత్కంఠతో సాగే సినిమాలు చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓటీటీల్లో డిఫరెంట్ జానర్ సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో తెరకెక్కించిన చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతున్నాయి. అలాంటి చిత్రాల్లో టాలీవుడ్ హీరోయిన్ షాలిని పాండే నటించిన క్రైం థ్రిల్లర్ మూవీ ఒకటి. మహిళా మాఫియా నేపథ్యంలో రూపొందించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్. ప్రస్తుతం ఓటీటీలో ఈ సిరీస్ కు విపరీతమైన క్రేజ్ వస్తుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 28న అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ ప్రస్తుతం టాప్ 3 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇందులో సీనియర్ నటి షబానా అజమీ, జ్యోతిక, నిమిషా సంజయన్, షాలినీ పాండే ప్రధాన పాత్రలలో నటించగా.. హితేష్ భాటియా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ విభిన్నమైన కథతో.. ఊహించని ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. లంచ్ బాక్సుల ద్వారా డ్రగ్స్ సరఫరా చేసే మహిళల కథ ఆధారంగా ఈ చిత్రాన్ని.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందించారు. ఈ సిరీస్ కు గౌరవ్ రైనా, తానా మర్వా సంగీతం అందించగా.. ఈషిత్ నరైన్ సినిమాటోగ్రఫీ అందించారు.

కథ విషయానికి వస్తే..

ముంబై నగరంలో జనాలకు లంచ్ బాక్సులు సరఫరా చేసే కొందరు మహిళలు ఎక్కువ డబ్బు కోసం వాటిలో డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. ఈ నెట్ వర్క్ ను విచారణ చేసే క్రమంలో పోలీసులకు అనేక షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. ఫార్మా కంపెనీలతో ఈ డ్రగ్స్ మాఫియాకు సంబంధం ఏంటీ ? ఈ మార్గాన్ని మహిళలు ఎందుకు ఎంచుకున్నారు ? చివరకు పోలీసులకు నిజాలు ఎలా తెలిశాయి అనేది సినిమా. ఆద్యంతం ఆసక్తికరంగా.. ఊహించని ట్విస్టులతో థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో సాగింది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.