
మంచు ఫ్యామిలి గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మనోజ్, విష్ణు మధ్య తగాదాలు, గొడవలతో మోహన్ బాబు ఫ్యామిలీ రోడెక్కిన విషయం తెలిసిందే. తనను ఇంట్లోకి రానివ్వడం లేదు అంటూ మనోజ్ ఆరోపిస్తున్నారు. విష్ణుకు నేనేనంటే కుళ్లు.. నన్ను ఎదగనివ్వకుండా తొక్కేశారు అంటూ మనోజ్ ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశారు. నా ఇంట్లో పెట్స్‌ను చూడటానికి కూడా నన్ను అనుమతించడం లేదు అంటూ ఆరోపణలు చేస్తూ మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేసిన విషయం తెలిసిందే. అలాగే తాను నటిస్తున్న భైరవం సినిమాకు బయపడి విష్ణు కన్నప్ప సినిమాను వాయిదా వేసుకున్నాడని అన్నారు మనోజ్. ఇక ఈ తగాదాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే ఈ గొడవల్లో ఎక్కడా మంచు లక్ష్మీ కనిపించలేదు. మనోజ్ కు మంచు లక్ష్మీ అంటే చాలా ఇష్టం.. పలు సందర్భాల్లో మనోజ్, లక్ష్మీ ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకున్నారు. తాజాగా మనోజ్ , లక్ష్మీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఓ ఈవెంట్‍లో అక్క మంచు లక్ష్మిని కలిశారు మనోజ్. టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్ భార్యతో సహా వెళ్లారు.
కాగా మంచు లక్ష్మీ స్టేజ్ పై ఉండగా వెనక నుంచి లక్ష్మీని పట్టుకున్నాడు మనోజ్. తమ్ముడిని చూడగానే ఒక్కసారిగా మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ పైనే తమ్ముడి ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే మనోజ్ భార్య మౌనిక అక్కడికి వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో మనోజ్ ను చూడగానే మంచు లక్ష్మీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకరాలుగా స్పందిస్తున్నారు.
#ManchuLakshmi got emotional
as soon as she saw her brother #ManchuManoj at an event yesterday
pic.twitter.com/G7dEoWnCZq
— Ram Ram (@RamRam246428691) April 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.