-
ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే సాధ్యమైన 200 కోట్ల కలెక్షన్‌ను ఇప్పుడు రీజనల్ సినిమా కూడా ఈజీగానే అందుకుంటున్నాయి. సౌత్ సినిమాలు మంచినీళ్ళు తాగినంత ఈజీగా 200 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. 2024లోనే ఈ లిస్టులోకి మలయాళం సినిమా కూడా ఎంట్రీ ఇచ్చింది. మంజుమ్మల్ బాయ్స్‌తో ఫస్ట్ టైమ్ 200 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయింది కేరళ ఇండస్ట్రీ.
-
కొన్నాళ్లుగా మలయాళం సినిమాకు గోల్డెన్ టైమ్ నడుస్తుంది. గతేడాది భ్రమయుగం, ప్రేమలు సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. మంజుమ్మల్ బాయ్స్ కొత్త చరిత్రే రాసేసింది. రెండేళ్ళ కింద టొవినో థామస్ హీరోగా నటించిన 2018 సినిమా 175 కోట్లు వసూలు చేస్తే.. 230 కోట్లతో మంజుమ్మల్ బాయ్స్ ఈ రికార్డ్ తిరగరాసింది.
-
తాజాగా లూసీఫర్ 2 ఈ రికార్డ్ తిరగరాసేలా కనిపిస్తుంది.మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వచ్చిన లూసీఫర్ సీక్వెల్‌గా ఎంపురాన్ వచ్చింది. నిజానికి ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే.. సీక్వెల్‌కు టాక్ ఏమంత గొప్పగా రాలేదు.
-
కానీ క్రేజ్ బాగా వర్కవుట్ అయింది. కేవలం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు వసూలు చేసింది ఎంపురాన్. ఈ చిత్ర దూకుడు చూస్తుంటే 300 కోట్లు వసూలు చేసేలా కనిపిస్తుంది. ఇది జరిగితే మలయాళంలో 300 కోట్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా నిలుస్తుంది.
-
ఎంపురాన్ చుట్టూ వివాదాలు కూడా బాగాను చుట్టుముట్టాయి. ఇందులో ఉన్న కొన్ని సన్నివేశాలపై ఒక మతస్తులు గుర్రుగా ఉన్నారు.. అలాగే కొన్ని సీన్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయనే టాక్ వచ్చింది. దాంతో మరోసారి సెన్సార్ చేసి.. 17 కట్స్ చెప్పారు. మొత్తానికి కాంట్రవర్సీలున్నా.. టాక్ యావరేజ్ అయినా.. కలెక్షన్ల వేటలో కుమ్మేస్తుంది మోహన్ లాల్ సినిమా.