Most Recent

Jr.NTR: బాబోయ్.. సింపుల్‏గా కనిపించిన చాలా కాస్ట్లీ గురూ.. దుబాయ్‏లో ఎన్టీఆర్ ధరించిన ఈ షర్ట్ ధర తెలిస్తే..

Jr.NTR: బాబోయ్.. సింపుల్‏గా కనిపించిన చాలా కాస్ట్లీ గురూ.. దుబాయ్‏లో ఎన్టీఆర్ ధరించిన ఈ షర్ట్ ధర తెలిస్తే..

జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న హీరోలలో ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇటీవలే దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తారక్.. ఇప్పుడు వార్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్. ఇందులో రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా.. వచ్చే వారం ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ దుబాయ్ లో తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం అర్జున్ S/o వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చారు తారక్. ఆ తర్వాత తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబందించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో తారక్ స్టైలిష్ న్యూ లుక్, అతను ధరించిన దుస్తులను చూసి ముగ్దులవుతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా దుబాయ్‌లో, అభిమానులతో జరిగిన సంభాషణలో ఎన్టీఆర్ సింపుల్‌గా కనిపించే నీలిరంగు పూల చొక్కా ధరించాడు. ఆ చొక్కా క్యాజువల్‌గా కనిపించింది. కానీ ఆ షర్ట్ ధర తెలిసి షాకవుతున్నారు.

నివేదికల ప్రకారం ఎన్టీఆర్ ధరించిన నీలిరంగు పూల చొక్కా ధర రూ.85,000 అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఒక ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్ బ్రాండ్ నుండి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ షర్ట్ ప్రైజ్ పై నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2, ఎన్టీఆర్-నీల్, దేవర 2 వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలాగే తమిళంలో ఓ టాప్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.