
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్వయం కృషితో పైకి వచ్చారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు. ఒకప్పుడు విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోగా రాణిస్తున్నాడు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన ఎవరో తెలుసా.? ఆ స్టార్ హీరో సినిమా వస్తున్నదంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. ఎంతో మంది యంగ్ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఆ హీరో.. హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు తోప్ హీరో.. ఇంతకూ ఆయన ఎవరంటే..
ఇది కూడా చదవండి : ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్స్‌లో.. ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యింది.. కానీ ఇప్పుడు
ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. ఒకొక్కరిది ఒకొక్క స్టైల్.. కానీ ఈ హీరోకి మాత్రం.. క్లాస్ మాస్ అని తేడా ఉండదు.. చిన్న పెద్ద అని లేదు.. అందరూ ఆయనను అభిమానిస్తారు. ఆయన సినిమా వస్తే చాలు థియేటర్ కు క్యూ కడతారు. ఆయన ఎవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.
ఇది కూడా చదవండి :ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ హీరోయినా.! ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
అంతే కాదు రవితేజ విలన్ గాను చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున నటించిన నిన్నేపెళ్లాడుతా సినిమాలో చిన్న విలన్ రోల్ లో కనిపించాడు. ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన రవితేజ ఆతర్వాత సింధూరం సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమా ఆఫర్స్ అందుకున్నాడు రవితేజ.. సిందూరం, ఖడ్గం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, భద్ర, నా ఆటోగ్రాఫ్, విక్రమార్కుడు, వెంకీ, దుబాయ్ శ్రీను, మిరపకాయ్, కిక్ , ధమకా, వాల్తేరు వీరయ్య ఇలా ఎన్నో హిట్స్ అందుకున్నాడు రవితేజ.. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇది కూడా చదవండి :ఆమె అంటే నాకు పిచ్చి.. ఆ అందానికే నేను పడిపోయా.. నాని ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.