Most Recent

పూరిజగన్నాథ్‌తో వరుసగా మూడు సినిమాలు.. కట్ చేస్తే ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.

పూరిజగన్నాథ్‌తో వరుసగా మూడు సినిమాలు.. కట్ చేస్తే ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమా స్టైల్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యంగా యూత్ ను ఎలా ఆకట్టుకోవాలి పూరికి బాగా తెలుసు.. అందుకే ఆయన సినిమాలు యూత్ ను విపరీతంగా మెప్పిస్తుంటాయి. డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్‌ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్‌తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. పూరి మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే కొంతకాలంగా పూరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్, రామ్ తో చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. ఓటీటీలో 11 ఏళ్లుగా ట్రెండింగ్..

ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కూడా నటిస్తుందని తెలుస్తుంది. అయితే పూరి సినిమాల్లో వరుసగా ఆయనతో మూడు సినిమాల్లో పని చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.ఆమె మూడు సినిమాలు చేస్తే అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్, రెండోది హిట్, మూడోది డిజాస్టర్ గా నిలిచాయి. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే మరొకరితో ఎఫైర్, మ్యారేజ్

రవితేజ కెరీర్లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇడియట్.. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది రక్షిత. ఇడియట్ సినిమాలో తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన శివమణి సినిమాలో నటించింది. నాగార్జున హీరోగా చేసిన ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించి మెప్పించింది. ఈ సినిమా హిట్ గా నిలిచింది. ఆతర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ఆంద్రావాల సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తెలుగులో ఈ చిన్నది చివరిగా అదిరిందయ్యా చంద్రంసినిమాలో నటించింది. కన్నడలో సినిమాలు చేసింది 2006తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.

ఇది కూడా చదవండి : తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్

 

View this post on Instagram

 

A post shared by Rakshita🧿 (@rakshitha__official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.