
గతంలో నటించిన చాలా మంది నటీనటులు ఇప్పుడు కనుమరుగయ్యారు. ఒకప్పుడు తమ నటనతో సినిమాకు ప్లస్ అయినవారు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న పాత్రలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేవి.. అంతే కాదు సినిమాల్లో వ్యాంప్ పాత్రలు కూడా మెప్పించేవి. అలాంటి పాత్రలతో పాపులార్ అయిన నటీమణులు చాలా మంది ఉన్నారు. వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. బోల్డ్ పాత్రలతో చాలాపాపులర్ అయ్యారు ఆమె. అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోదు ఆమె.. నటనతో ప్రేక్షకులను దగ్గరయ్యారు. కానీ ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యారు. ఒకప్పుడు ఆమెకు కుర్రాళ్లలో మంచి కేజ్ ఉండేది. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఒకప్పుడు సినిమాల్లో బోల్డ్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన వారిలో రమ్య శ్రీ ఒకరు. సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రమ్యశ్రీ. ముఖ్యంగా బోల్డ్ పాత్రలతో ఆమె పాపులర్ అయ్యారు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి భాషల్లో దాదాపు 250కి పైగా సినిమాలు చేసి మెప్పించారు ఈ స్టార్ యాక్టర్. అప్పట్లో రమ్యశ్రీకి కుర్రాళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ప్రస్తుతం రమ్య శ్రీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నటిగా కెరీర్‌ను ప్రారంభించిన రమ్యశ్రీ, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించింది.
రమ్యశ్రీ ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది. నువ్వు నేను, ఆది, సింహాద్రి, యమగోల మళ్ళీ మొదలయింది లాంటి చిత్రాల్లో రమ్యశ్రీ నటించింది. అయితే బోల్డ్ పాత్రలు చేయడంతో ఆమె చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. అలాగే బోల్డ్ రోల్స్ చేయడం వల్ల చాలా మంది తనను తప్పుడు ఉద్దేశంతో చూశారని తెలిపింది. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నన్ను ఈవెంట్స్ కు పిలవలనుకున్నా.. ఆమె బట్టలు సరిగ్గా వేసుకోదు ఎందుకు అని కామెంట్స్ కూడా చేశారట. అమెరికాలో ఓ ఈవెంట్ కోసం ముందుగా రమ్యను పిలిచారట.. ఆతర్వాత ఆమె అసభ్యకరంగా బట్టలు వేసుకుంటుని అని ఆమెను వద్దు కొందరు అన్నారట.. ఆ తర్వాత కొంతమంది బట్టల్లో ఏముంది.. ఇక్కడ మనం వేసుకోవడం లేదా అని సపోర్ట్ గా మాట్లాడి తనను ఇన్వైట్ చేశారు అని తెలిపింది. ఆ తర్వాత అక్కడ నన్ను చూసి అంతా షాక్ అయ్యారు. సినిమాల్లో అంత బోల్డ్ గా ఉంటారు బయట చాలా డీసెంట్ గా ఉన్నారు అని షాక్ అయ్యారు. ఓ పెద్దాయన నన్ను ఉద్దేశిస్తూ.. చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు.. డ్రెస్ ని చూసి అంచనా వేయకూడదు అని అన్నారు అని తెలిపింది. అలాగే తనకు బీ గ్రేడ్ సినిమాలో నటించమని కూడా ఆఫర్స్ వచ్చాయి అని తెలిపింది. నీలి చిత్రాల్లో నటించమని నాపై చాలా మంది ఒత్తిడి తెచ్చారు. నేను అలాంటి సినిమాలు చేయను అని గట్టిగా వాదించాను. సినిమాల్లో దర్శకులు చెప్పారని పొట్టి బట్టలు వేసుకుంటాను అంత మాత్రానా అలాంటి సినిమాలు చేయను అని అన్నారు రమ్య శ్రీ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.