Most Recent

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ,.. సినిమా ఎలా ఉందంటే

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ,.. సినిమా ఎలా ఉందంటే

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా  నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మాతలు అశోక్ వర్దన్ ముప్పా, సునీల్ బలసు నిర్మించారు. శ్రీనివాస్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

మదర్, సన్ మధ్య కథ మంచి సెటప్‌ మొదలైంది. కొన్ని సీక్వెన్సెస్ బాగున్నాయి అని కొందరు, కళ్యాణ్ రామ్ యాక్షన్ అదరగొట్టారని, విజయశాంతి యాక్షన్ బాగుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.  పోలీస్ రోల్‌లో చాలా రోజు తర్వాత కల్యాణ్ రామ్ కనిపించాడు. కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయని కొందరు రాసుకొచ్చారు.

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.