-
వరుణ్ సందేశ్ ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలు తగ్గించేసింది వితికా షెరు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార.
-
తాజాగా వితిక తన చెల్లి కృతిక గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసుకుంది
-
ఇందులో అక్కా చెల్లెళ్లిద్దరూ ఎంతో క్యూట్ గా కనిపంచారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.
-
వితిక, కృతిక ల ఫొటోలను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సినిమా ఇండస్ట్రీతో కృతికకు ఎలాంటి సంబంధం లేదు.
-
కాగా 2021లో చెల్లి కృతిక పెళ్లి దగ్గరుండి జరిపించింది వితిక. ఈ క్రమంలోనే తాజాగా భర్త కృష్ణతో కలిసి కొత్తింట్లో అడుగుపెట్టింది కృతిక.
-
ఇక వితిక ఇటీవల వంద మంది చిన్నారులకు స్వయంగా గుత్తి వంకాయ కూర బిర్యానీ వండి వడ్డించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెటిజన్లు ఆకట్టుకుంటోంది.