
ఇటీవల కాలంలో మలయాళ సినిమాల కు బాగా ఆదరణ పెరిగిపోయింది. థియేటర్లలో ఈ సినిమాలు భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. ఇక ఓటీటీలో అయితే ఈ మాలీవుడ్ సినిమాలదే హవా. ముఖ్యంగా వారు పెద్ద సంఖ్యలో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు మలయాళంలో విజయవంతమైన సినిమా ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఏడాది జనవరి 9న మలయాళంలో ‘రేఖచిత్రం’ అనే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా విడుదలైంది. ఇందులో ఆసిఫ్ అలీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అలాగే అనశ్వర రంజన్ మరో కీలక పాత్రలో ఆకట్టుకుంది. మనోజ్ జయన్, సిద్ధిఖీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. రూ. 6 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే ఏకంగా రూ. 66 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఇక టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో ఈ సినిమాకు 40,000 కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అలాగే IMDBలో ఈ చిత్రానికి 8.8 రేటింగ్ కూడా ఉండడం విశేషం. ఇలా ఎన్నో విశేషాలున్న రేఖా చిత్రం మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ రేఖా చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 7 నుంచి ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించారు. అంటే ఇవాళ్టి అర్ధ రాత్రి నుంచే రేఖా చిత్రం ఓటీటీలోకి రానుందన్నమాట. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.
జోపిన్ టి. చాకో తెరకెక్కించిన రేఖా చిత్రం సినిమాలో అసిఫ్, అనస్వరతో పాటు మనోజ్ కె.జయన్, సిద్దిఖి, జగదీశ్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ముజీబ్ మజీద్ సంగీతం అందించాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే..
ఒక పట్టణంలో వరుస హత్యలు జరుగుతాయి. దీని వెనక గల మిస్టరీని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు పోలీసాఫీసర్ అసిఫ్ అలీ. అయితే విచారణలో అతనికి ఊహకు అందని విషయాలు తెలుస్తాయి. మరీ ఈ మర్డర్లను చేసిందెవరు? హీరో నేరస్తులను పట్టుకున్నాడా? అసలు ఈ వరుస హత్యలకు కారణమేంటి? అని తెలుసుకోవాలంటే రేఖా చిత్రం సినిమాను చూడాల్సిందే. మంచి క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి రేఖా చిత్రం మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
సోనీ లివ్ లో స్ట్రీమింగ్..
Step into a time machine and relive the magic of retro Mammootty!
Watch #Rekhachithram from March 7 only on sonyLIV!#Rekhachithram #AsifAli #AneswaraRajan #JofinTChacko #ManojKJayan #ZarinShihab #BhamaArun #MeghaThomas pic.twitter.com/00r2nrAwDw— Sony LIV (@SonyLIV) March 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.