
ప్రముఖ నటి కియారా అద్వానీ ఇటీవల శుభవార్త చెప్పింది. ఆమె త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కియారా అద్వానీ గర్భంతో ఉందని తెలియగానే ఆమె అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కియారా అద్వానీ, ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రాలకు ముందస్తు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అయితే కియారా టేకప్ చేసిన సినిమాలకు సంబంధించి మరో వార్త వస్తోంది. కియారా అద్వానీ గర్భం ధరించిందని తెలియగానే ‘డాన్ 3’ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయిందని తెలుస్తోంది. కియారా అద్వానీకి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. హిందీతో పాటు దక్షిణాదిలోనూ ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే కియారా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. యష్ రాబోయే చిత్రం ‘టాక్సిక్’లో కూడా కియారా అద్వానీ నే హీరోయిన్. అలాగే హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ‘వార్ 2’ చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తోంది. అయితే ‘డాన్ 3’ సినిమా నుంచి కియారా అనూహ్యంగా తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. ‘డాన్ 3’ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరో గా నటిస్తున్నాడు. అతని సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుందని ఇది వరకే ప్రకటన వెలువడింది. అయితే, గర్భవతి అయిన తర్వాత షూటింగ్‌లో పాల్గొనడం కష్టంగా ఉండటం వల్ల ‘డాన్ 3’ నుంచి కియారా అద్వానీ తప్పుకున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.
‘డాన్ 3’ చిత్ర బృందం నుంచి కియారా బయటకు వెళ్లింది, కాబట్టి ఇప్పుడు మరో నటిని ఎంపిక చేయాల్సి ఉంది. కానీ ఈ పరిణామాలన్నింటి గురించి చిత్ర బృందం లేదా కియారా అద్వానీ ఏమీ చెప్పలేదు. అయితే త్వరలో ఈ విషయమై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావడం ఖాయమని తెలుస్తోంది. ఇది కాకుండా, కియారా అనేక ఇతర చిత్రాలలో కూడా నటిస్తోంది. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా మరికొన్ని సినిమాల నుంచి కియారా తప్పుకోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కియారా అద్వానీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.