Most Recent

Robinhood Twitter Review: రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ.. నితిన్ ఈసారైనా హిట్ కొట్టాడా..?

Robinhood Twitter Review: రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ.. నితిన్ ఈసారైనా హిట్ కొట్టాడా..?

యంగ్ హీరో నితిన్ హిట్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. భీష్మ సినిమా తర్వాత నితిన్ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు. కాగా ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. నేడు ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తో పాటు డేవిడ్ వార్నర్ కూడా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే పడటంతో సినిమా రివ్యూను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

గతంలో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో భీష్మ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి థియేటర్స్ లో మరోసారి నవ్వులు పూయించారని అంటున్నారు అభిమానులు. నితిన్ బ్లాక్ బస్టర్ కొట్టాడని , నితిన్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, వెన్నెల‌కిషోర్ కాంబోలో వ‌చ్చే కామెడీ సినిమా మాత్రం బాగా న‌వ్విస్తాయ‌ని చెబుతోన్నారు,  కామెడీ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

నితిన్ రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ..

నితిన్ రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.