
కొన్ని రోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మకు బ్రేకప్ చేప్పేసిందని, రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట విడిపోయారనే వార్తలు విపరీతంగా వచ్చాయి. ఒకవైపు ఈ వీరి బ్రేకప్ ప్రచారం జోరుగా సాగుతున్నా మరో పక్క తమన్నా ప్రస్తుతం ఓదెలా 2తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది. దీంతో అసలు బ్రేకప్ వార్తలు నిజమేనా? లేదా సినిమా ప్రమోషన్స్ కోసం ఎవరైనా క్రియేట్ చేశారా? అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో గత రెండేళ్లుగా తమన్నా – విజయ్ వర్మ డీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది.
కానీ, ఇంతలో ఏమైందో ఏమో కానీ వాళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఇద్దరి తమ డేటింగ్‌కు పుల్‌స్టాప్ పెట్టేసి, విడిపోయారు అనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అంతా షాక్ అయ్యారు. అసలు అంత అందమైన అమ్మాయికి బ్రేక్ ఎలా చెప్పావ్ బ్రో అంటూ సోషల్ మీడియాలో విజయ్ వర్మపై మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇంత జరుగుతున్నా.. ఈ వార్తలను అటు తమన్నా కానీ, ఇటు విజయ్ వర్మ కానీ ఖండించలేదు. దీంతో వీరి బ్రేకప్ నిజమే అనే క్లారిటీ ప్రేక్షకులకు వచ్చేసింది. ఏ లేదు లేదు అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలాలంటే మాత్రం తమన్నా, విజయ్ వర్మ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. లేదా ఏదో ఒక ఈవెంట్‌లో వీళ్లిద్దరు కలిసి తళుక్కున మెరిసినా ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పడుతుంది. ప్రస్తుతానికి అయితే వీరిద్దరు విడిపోయారు అనేది మాత్రం బలంగా వినిపిస్తున్న మాట.
ఇవి కూడా చదవండి: Actress Ramya: నాకు కోటి.. వాళ్లకు రూ. 5 కోట్లు.. సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల ఇక్కడ క్లిక్ చేయండి.