Most Recent

Kayadu Lohar: ఎప్పటి నుంచో చేస్తుంటే.. ఇప్పటికి నన్నుగుర్తించారు.. డ్రాగన్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్

Kayadu Lohar: ఎప్పటి నుంచో చేస్తుంటే.. ఇప్పటికి నన్నుగుర్తించారు.. డ్రాగన్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్

కయాదు లోహర్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ అమ్మడి పేరే వినిపిస్తుంది. 2021లో కన్నడ చిత్రం “ముగిల్‌పేట” అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆమె వివిధ భాషల్లో సినిమాల్లో నటించి క్రేజ్ ను సొంతం చేసుకుంది. మలయాళంలో “పాథోన్‌పథం నూట్టండు” అనే సినిమా చేసింది ఇది 2022 సెప్టెంబరు 8న విడుదలై, ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి  ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది, అయితే ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. దాంతో ఈ చిన్నదానికి అంతగా గుర్తింపు రాలేదు. ఇక రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది

డ్రాగన్ సినిమా 2025 ఫిబ్రవరి 21న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా విజయంతో కయాదు లోహర్ యూత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. “డ్రాగన్” సినిమా విజయం తర్వాత కయాదు లోహర్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం తమిళంలో “ఇదయం మురళి”అనే చిత్రంలో అధర్వతో కలిసి నటిస్తోంది. అలాగే, తమిళ స్టార్ హీరో సింబుతో “STR 49” అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే

డ్రాగన్‌కు లభించిన ఆదరణ అద్భుతంగా ఉంది. దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు నాలోని సామర్థ్యాన్ని, ప్రతిభను చూస్తున్నారు. డ్రాగన్ రాకముందు, కయాదు లోహర్ ఎవరో ఎవరికీ తెలియదు. ఇప్పుడు, ప్రేక్షకులు సినిమాలో నా పాత్రను ఇష్టపడతారు. ఇప్పటికీ నన్ను కయాదు లోహర్ గానే గుర్తిస్తారు. ఇది సాధించడం చాలా కష్టం. నేను ఎప్పుడూ కలలు కనే ప్రాజెక్టులు నాకు లభిస్తున్నాయి, కాబట్టి ఈ ప్రేమను పొందడం నా అదృష్టం అని కయాదు లోహర్ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..

 

View this post on Instagram

 

A post shared by kayadulohar (@kayadu_lohar_official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.