
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన విజయం తర్వాత దేవర సినిమాతో హిట్ కొట్టాడు తారక్. ఈ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. మాములుగా రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరో చేసే సినిమాలు ఫ్లాప్ అవుతాయని టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది. దాన్ని తారక్ బ్రేక్ చేశాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ లుక్, డైలాగ్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దేవర సినిమాను త్వరలోనే జపాన్ లో విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ కు జపాన్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లోనూ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కూడా చేశారు ఎన్టీఆర్. అక్కడ తారక్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. కాగా ఇప్పుడు దేవర సినిమాను కూడా జపాన్ లో విడుదల చేయనున్నారు.
కాగా దేవర సినిమా జపాన్ లో మార్చి 28, 2025న విడుదల కానుంది. ఎన్టీఆర్ మార్చి 22, 2025న జపాన్ వెళ్తున్నారు అక్కడ సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో కూడా పాల్గొంటారని సమాచారం. కాగా రీసెంట్ గా జపాన్‌లో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది. జపాన్‌లో జరిగిన ప్రత్యేక ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్‌లో దేవరాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దాంతో తారక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Blockbuster Response For #Devara From Special Private Preview Show In Japan @tarak9999
.#デーヴァラ #DevaraInJapan @DevaraMovie @devaramovie_jp #JrNTR𓃵pic.twitter.com/TfRFKmRWyU
— Gajuwaka NTR fans
(@GajuwakaNTRfc) March 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.