
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ సినిమాలో నటించనుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన వార్ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఇక ఇప్పుడు హృతిక్ తో కలిసి తారక్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యిందని తెలుస్తుంది. కాగా ఇటీవలే ఈ సినిమాలో అదిరిపోయే సాంగ్ షూట్ జరిగింది. కాగా ఈ సినిమా షూటింగ్ లో స్టార్ హీరో గాయపడ్డాడని తెలుస్తుంది.
వార్ 2 మూవీ షూటింగ్ లో హీరో హృతిక్ రోషన్ గాయపడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. సాంగ్ రిహార్సిల్స్ లో హృతిక్ గాయపడ్డట్టు బాలీవుడ్ ల్లో వార్తలు వస్తున్నాయి. వార్ 2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హృతిక్, తారక్ మధ్య ఓ అదిరిపోయే సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సాంగ్ రిహార్సిల్స్ లోనే హృతిక్ గాయపడ్డాడని తెలుస్తుంది.
ప్రస్తుతం హృతిక్ కు చికిత్స చేస్తున్నారట వైద్యులు . . దాంతో సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తుంది.. దాంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కాగా హృతిక్ ను వైద్యులు నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలు వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తల పై క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..