Most Recent

Tollywood: బంగీ జంప్‌ చేస్తూ స్టార్ హీరోయిన్ దుర్మరణం అంటూ పుకార్లు.. వీడియో వైరల్

Tollywood: బంగీ జంప్‌ చేస్తూ స్టార్ హీరోయిన్ దుర్మరణం అంటూ పుకార్లు.. వీడియో వైరల్

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక పెద్ద పుకారు షికారు చేస్తోంది. బంగీ జంప్ చేస్తూ ప్రమాదవశాత్తూ తాడు తెగిపోవడంతో ఆమె లోతైన లోయలోకి పడిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీంతో హీరోయిన్ అభిమానులు తెగ ఆందోళన పడిపోయారు. అయితే కాసేపటికే అది ఫేక్ వీడియో అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఫేక్ డెత్ రూమర్ల బారిన పడిన హీరోయిన్ మరెవరో కాదు ఇటీవల వరుణ్ తేజ్ మట్కాలో ఓ కీలక పాత్ర పోషించిన నోరా ఫతేహి. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో మెప్పిస్తోన్న ఈ ముద్దుగుమ్మ మృతి చెందిందంటూ ఓ ఇన్ స్టా గ్రామ్ పేజీ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నోరా ఫతేహి బంగీ జంప్ చేసేందుకు ఎత్తైన ప్రదేశం నుంచి దూకిందని, రోప్ తెగిపోవడంతో ఆమె లోయలోకి పడిపోయి ప్రాణాలు కోల్పోయిందని నకిలీ ఫోటోలు జత చేసి షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా నోరా అభిమానులు, బంధువులు టెన్షన్ పడ్డారు.

అయితే బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం నోరా ఫతేహి క్షేమంగా ఉన్నట్లు స్పష్టమైంది. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో కల్పితమని క్లారిటీ వచ్చింది. బంగీ జంప్ చేస్తూ మృతి చెందిన మహిళ,నోరా ఫతేహి కాదని తేలింది. దీంతో నోరా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం ఫేక్ వీడియో షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజీపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకి ట్యాగ్ చేస్తున్నారు. దీంతో ఇన్ స్టా గ్రామ్ పేజీ నిర్వాహకులు ఆ ఫేక్ వీడియోని తొలగించారు. కానీ అప్పటికే ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నోరాకు నివాళి, సంతాపం తెలియజేస్తూ కామెంట్లు, పోస్టులు షేర్ చేశారు.

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

తెలుగులో టెంపర్, బాహుబలి ది బిగినింగ్, కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది నోరా. ఇటీవల మట్కాలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. ఒక వైపునోరా మరణానికి సంబంధించిన పుకార్లు వ్యాపిస్తుండగానే మరోవైపు ఆమె సోషల్ మీడియాలో పోస్టులను పంచుకుంటోంది. నోరా కొత్త పాట ఇప్పుడే విడుదలైంది. ప్రస్తుతం తన పాట ప్రమోషన్‌లో నోరా బిజీగా ఉంది. నోరా ఫతేహి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువ.

సాంగ్ ప్రమోషన్లలో బిజీ బిజీగా నోరా..

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.