Most Recent

Preity Zinta: పదేళ్ల క్రితమే అప్పు చెల్లించా.. కాంగ్రెస్‌ ఆరోపణలు సిగ్గుచేటు: ప్రీతి జింటా

Preity Zinta: పదేళ్ల క్రితమే అప్పు చెల్లించా.. కాంగ్రెస్‌ ఆరోపణలు సిగ్గుచేటు: ప్రీతి జింటా

తనకు బ్యాంక్‌లో రుణమాఫీ జరిగిందని కేరళ కాంగ్రెస్‌ చేసిన ట్వీట్‌పై బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా మండిపడుతున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్లను బీజేపీకి అప్పగించినందుకు ఓ బ్యాంకులో ఆమె తీసుకున్న కోట్ల రుణంం మాఫీ అయ్యిందని ఆరోపిస్తూ కేరళ కాంగ్రెస్ ట్వీట్‌ చేసింది. న్యూఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకులో ప్రీతి జింటా రూ.18 కోట్ల రుణం తీసుకున్నారని, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించడంతో ఆ మొత్తం మాఫీ అయ్యిందని, గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డునపడ్డారని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. అయితే కేరళ కాంగ్రెస్‌ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు ప్రీతి జింటా.. సోషల్ మీడియా అకౌంట్లను తాను సొంతంగానే నిర్వహించుకుంటానని, ఎవరికీ వాటిని అప్పగించలేదని స్పష్టం చేశారు.

ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాదు బ్యాంక్‌ రుణాన్ని పదేళ్ల క్రితమే చెల్లించినట్టు స్పష్టం చేశారు. ఎక్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోస్ట్‌ చూసి తాను షాక్‌కు గురైనట్టు తెలిపారు. ఓ రాజకీయ పార్టీ నా పేరును వాడుకుని తప్పుడు సమాచారం ఎలా ప్రచారం చేస్తుందని ప్రశ్నించారు. వాస్తవాలు తెలియకుండా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.

ప్రీతి జింటా ట్వీట్..

మహారాష్ట్రలోని న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌ జనరల్ మేనేజర్, అకౌంట్స్ హెడ్ హితేష్ మెహతా రూ.122 కోట్ల బ్యాంకు సొమ్మును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక నేరం ఆరోపణల కేసులో అరెస్టైన హితేశ్ ప్రస్తుతం ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.