
సౌత్ ఇండస్ట్రీలోని ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోలలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. తమిళంలో లవ్ టుడే సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోగానే కాకుండా లవ్ టుడే సినిమాకు దర్శకత్వం వహించి అటు డైరెక్టర్ గానూ సక్సెస్ అయ్యాడు ప్రదీప్. ప్రస్తుతం డ్రాగన్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు హీరోగా, రచయితగా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. తాజాగా చెన్నైలో జరిగిన డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ప్రదీప్ రంగనాథన్ కెరీర్ తొలినాళ్లల్లో సినీరంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నాడు. తాను హీరో అని తెలియగానే ఎంతో మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారని తెలిపారు.
ప్రదీప్ మాట్లాడుతూ.. “నన్ను చాలా మంది కిందకు లాగాలని ప్రయత్నిస్తున్నారు. నేను చూస్తూనే ఉన్నాను. కానీ నేను పెరుగుతున్న మొక్కను. మొక్క మానవడానికి చాలా కష్టపడుతుంది. నేను కూడా అలాగే సవాల్లు స్వీకరిస్తూ మరింత బలంగా ఎదుగుతాను. నేను హీరోగా నటించిన ఫస్ట్ మూవీ లవ్ టుడే విషయానికి వస్తే.. ఈ సినిమాకు హీరోయిన్ దొరకడం చాలా కష్టమైంది. నేను హీరో అనగానే చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు. నాతో నటించేందుకు చాలా మంది హీరోయిన్స్ ఆలోచించారు. ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. మరికొందరేమో నిజాయితీగా నా పక్కన చేయనని.. పెద్ద స్టార్లతో మాత్రమే నటిస్తామని చెప్పారు. వారి నిజాయితీకి థాంక్స్” అని అన్నారు.
ఇప్పుుడు తాను నటిస్తోన్న డ్రాగన్ సినిమాలో అనుపమ్ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుందని.. కాలేజీ రోజుల్లో అనుపమ నటించిన ప్రేమమ్ సినిమా చూశానని.. ఇప్పుడు ఆమెతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. డ్రాగన్ సినిమాకు డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కేఎస్ రవికుమార్, మిస్కిన్, వీజే సిద్దు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన