Most Recent

Vishal: విశాల్ అలా అయిపోవడానికి ఆయనే కారణమా..? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vishal: విశాల్ అలా అయిపోవడానికి ఆయనే కారణమా..? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

స్టార్ హీరో విశాల్ కు సంబందించిన వార్తలు ఈ మధ్య తెగ వినిపిస్తున్నాయి. విశాల్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పెద్ద ఎత్తిన వార్తలు రావడంతో.. అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాల్ మగధరాజా మూవీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో చాలా బలహీనంగా, కనీసం మాట్లాడలేని స్థితిలో కనిపించారు. దాంతో విశాల్ గురించి రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. విపరీతంగా డ్రగ్స్ తీసుకోవడం వల్లే విశాల్ కు ఇలా అయ్యిందని కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. అలాగే విశాల్ అనారోగ్యానికి దర్శకుడు బాలా కారణమంటూ ఇంటర్నెట్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీని పై దర్శకుడు బాలా స్పందించారు. బాలా దర్శకత్వంలో నటుడు అరుణ్ విజయ్ నటించిన వనగన్ చిత్రం పొంగల్ 10న థియేటర్లలో విడుదలైంది. ముందుగా ఈ సినిమాలో నటుడు సూర్య నటిస్తాడని ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి సూర్య తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత దర్శకుడు బాలా అరుణ్ విజయ్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసారు.

ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో ఉన్న ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. దర్శకుడు బాలూమహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన దర్శకుడు బాలా తమిళ చిత్రసీమలోకి దర్శకుడిగా అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు కేవలం 8 చిత్రాలకు దర్శకత్వం వహించినా, కోలీవుడ్ చిత్రసీమలో బాలా తనదైన ముద్ర వేశారు. తొలి సినిమాతోనే కోలీవుడ్ సినిమా మొత్తం తన వైపు చూసేలా చేశాడు బాల.  2001లో నటుడు సూర్య నటించిన నందా చిత్రానికి బాల దర్శకత్వం వహించారు. నంద సినిమా తర్వాత సూర్య రేంజ్ మారిపోయింది.

ఇక విశాల్ విషయానికొస్తే.. విశాల్ , ఆర్యతో కలిస్ అవన్ ఇవన్ అనే సినిమా చేశారు బాల. ఈ సినిమా తెలుగులో వాడు వీడు గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు విశాల్ అనారోగ్యానికి బాల కారణం అంటూ వస్తున్న రూమర్స్ పై ఆయన స్పందించారు. వనంగాన్ విజయం సందర్భంగా దర్శకుడు బాలా మీడియాతో మాట్లాడుతూ, విశాల్ ఇటీవలి అనారోగ్యానికి కారణం అవాన్ ఇవాన్‌లో నేను అతనికి దృష్టి లోపం ఉన్న పాత్రను ఇచ్చాను. అది సినిమా వరకే.. ఇప్పుడొస్తున్న వార్తల పై నేనేం చెప్పగలను. ఎవరు ఇష్టమొచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు.. అవన్నీ నేను పట్టించుకోను అని బాల అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.