Most Recent

Sankranthiki Vasthunam OTT: ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం! ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

Sankranthiki Vasthunam OTT: ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం! ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి సూపర్ హిట్స్ తర్వాత వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షిల నటనకు మంచి పేరొచ్చింది. ఇక బుల్లిరాజు కామెడీ హైలెట్ గా నిలిచింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా కేవలం రెండు వారాల్లోనే రూ. 276 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లోనూ 2.7 మిలియన్ డాలర్ల మేర కలెక్షన్లు రాబట్టింది. ఫిబ్రవరి రెండో వారం వరకు పెద్ద చిత్రాలేవీ లేకపోవడంతో ఈ సినిమా వసూళ్లు మరింత గా పెరిగే అవకాశముంది. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 2వ వారంలోనే ఈ మూవీని స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని ముందుగానే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. అయితే ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. వసూళ్లు కూడా భారీగానే వస్తున్నాయి. దీంతో ఓటీటీ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ విడుదలను వాయిదా వేయమని మేకర్స్ జీ5 ఓటీటీ టీమ్ ను రిక్వెస్ట్ చేస్తున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించి చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ సంక్రాంతి వస్తున్నాం సినిమా ఓటీటీ విడుదల ఆలస్యమైతే వెంకటేశ్ మూవీ మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఆ సినిమా వసూళ్లు రూ. 300 కోట్లకు చేరువయ్యాయి. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటివారంలో ఓటీటీకి రావచ్చని సమాచారం. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

రూ. 300 కోట్లకు చేరువలో వెంకటేశ్ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.