Most Recent

Rana Daggubati: స్టార్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం.. పాడె మోసిన హీరో రానా

Rana Daggubati: స్టార్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం.. పాడె మోసిన హీరో రానా

అమ్మమ్మ, నానమ్మలంటే చిన్నారులకు చాలా ఇష్టం. తల్లి కోపడినపుడు గారంగా ఇంట్లో పెద్ధవాళ్ల వెనక్కు వెళ్లి పిల్లలు దాక్కుంటారు. ఆడుకుంటూ వారి చెంగు ముఖానికి కప్పుకుని దాగుడుమూతలు ఆడతారు. వయస్సు మళ్లిన వ్రృద్ధులకు మనుమల చిలిపి చేష్టలు, ముద్దు – ముద్దు ముచ్చట్లు తీపి జ్ఞాపకాలు గా ఉంటాయి. తమతో పడుకున్న మనుమలు, మనుమరాళ్లకు నీతి కథలు చెప్పటం లోక రీతిని బోధించటం పెద్ధవాళ్లకు సరదా.

అంతేనా తమ పిల్లల సంతానం ఇంటికి వేస్తే తెగ సంబరపడి పోయి వారికి ఇష్టమైన తినుబండారాలు చేసి. స్వయంగా వారికి వడ్డించి వారి కళ్లలో ఆనందాన్ని చూస్తారు. ఆ సంతోషం లో తమ కష్టాన్ని మరచి పోతారు. పిల్లలకు తమ అమ్మమ్మలు, నాయనమ్మ లతో ఎంతో అనుబంధం ఉంటుంది. వారితోనే ఎక్కువగా కొలక్షేపం చేస్తారు. కాసేపు వారు కనిపించకపోయినా ఎక్కడకు వెళ్లరని వొకబు చేస్తారు.

ఈ జ్ఞాపకాలు సినీ నటుడు దగ్గుపాటి రానాకు ఉన్నాయి. ఇటీవల తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మ్రృతి చెందారు. ఆమె అంత్యక్రియలకు ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ ఆయన కుమారుడు రాణాలు హాజరయ్యారు. రాజేశ్వరి దేవి నటుడు రానాకు అమ్మమ్మ, దగ్గుపాటి సురేష్ ఆమెకు అల్లుడు. అంతిమయాత్రలో పాల్గొన్న రానా తన అమ్మమ్మ పాడె ను మోశారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను బంధువులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఒక ఫోటో బయటకు రావటంతో అందరూ రానాకు తణుకు ప్రాంతానికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.