Most Recent

Ramnagar Bunny OTT: ఓటీటీలో ప్రభాకర్ కుమారుడి సినిమా.. రామ్ నగర్ బన్నీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ramnagar Bunny OTT: ఓటీటీలో ప్రభాకర్ కుమారుడి సినిమా.. రామ్ నగర్ బన్నీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రముఖ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం రామ్ నగర్ బన్నీ. శ్రీనివాస్ మహత్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో చంద్రహాస్ సరసన విస్మయ శ్రీ హీరోయిన్‍గా నటించింది. గతేడాది అక్టోబర్ 04న థియేటర్లలో విడుదలైన రామ్ నగర్ బన్నీ సినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా చంద్రహాస్ డ్యాన్స్ లు, డైలాగులు, ఫైట్స్ కు మంచి మార్కులు పడ్డాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన రామ్ నగర్ బన్నీ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా రామ్ నగర్ బన్నీ సినిమా స్ట్రీమింగ్ పై ఆహా అప్ డేట్ ఇచ్చింది. జనవరి 17 నుంచి రామ్ నగర్ బన్నీ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. యాటిట్యూబ్ స్టార్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అంటూ ఈ మేరకు సినిమా పోస్టర్ ను కూడా షేర్ చేసింది.

రామ్ నగర్ బన్నీ సినిమాలో రిచా జోషి, అంబికా వాణి, మరళీధర్ గౌడ్, రితూ మంత్ర, సుజాత, మధునందన్, సమీర్ కీలకపాత్రలు పోషించారు. ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్ ఈ సినిమాన నిర్మించారు. అశ్విన్ హేమంత్ సంగీతం అందించగా, అష్కర్ అలీ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మరి థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన రామ్ నగర్ బన్నీ సినిమా ఓటీటీలో ఏ మేర అలరిస్తుందో చూడాలి.

 మరో రెండు రోజుల్లో ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్..

రామ్ నగర్ బన్నీ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.