Most Recent

Ram Charan: ఆ సినిమా ఎందుకు చేశానా అనిపించింది.. బాలయ్య షోలో రామ్ చరణ్..

Ram Charan: ఆ సినిమా ఎందుకు చేశానా అనిపించింది.. బాలయ్య షోలో రామ్ చరణ్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ రేపు థియేటర్లలో గ్రాండ్ గా విడుదలకానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు రానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రయూనిట్.. ఆ తర్వాత ముంబై, హైదరాబాద్ లో వరుసగా ఈవెంట్స్ జరిపింది. అలాగే నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో పాల్గొన్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ నుంచి విడుదలైన ప్రోమో ఆకట్టుకుంది. ఇందులో చరణ్ తన పర్సనల్ లైఫ్, సినిమాల గురించి అనేక విషయాలను పంచుకున్నాడు. దీంతో ఈ ఎపిసోడ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ జనవరి 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోలో చరణ్ బోలెడన్నీ విషయాలను పంచుకున్నారు.

ఇదే షోలో చరణ్ మొదటి సారి స్టేజి పై మాట్లాడిన వీడియోను ప్లే చేశారు బాలయ్య. 2004లో ఫ్యాన్స్ నిర్వహించిన చిరంజీవి బర్త్ డే ఈవెంట్లో చరణ్ ఫస్ట్ టైమ్ స్టేజి పై మాట్లాడారు. అలాగే ఈ సినిమాను ఎందుకు చేశాను అని ఏ చిత్రం విషయంలో అనుకున్నావ్ అని బాలకృష్ణ అడగ్గా.. జంజీర్ అని చెప్పాడు చరణ్. ఆ మూవీ ఎందుకు చేశానో తనకే తెలియదని అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి సూపర్ హిట్ జంజీర్ చిత్రాన్ని మరోసారి రీమేక్ చేసిన సంగతి తెలిసింది. ఈ చిత్రాన్ని తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ చేశారు.

బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లాఖియా తెరకెక్కించిన జంజీర్ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటించాడు. ఇందులో బీటౌన్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించింది. ఈ సినిమాను తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.