Most Recent

Raashi Khanna: అలాంటి సినిమాలే నాకు ఇష్టం.. గేరు మార్చాలి అంటున్న రాశీఖన్నా

Raashi Khanna: అలాంటి సినిమాలే నాకు ఇష్టం.. గేరు మార్చాలి అంటున్న రాశీఖన్నా

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రాశి ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ. రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది. కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదు. దాంతో ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫోకస్ పెడుతుంది. దాంతో రాశీ ఖన్నా టాలీవుడ్ కు దూరం అవుతుంది అని అంటున్నారు కొందరు అభిమానులు. కానీ ఈ అమ్మడు అవకాశం వస్తే ఏ బాషలోనైనా నటించి మెప్పిస్తాను అంటుంది.

ప్రస్తుతం యంగ్ బ్యూటీస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వారికి గట్టిపోటీ ఇచ్చేలా రాశీ ఖన్నా కూడా గగ్లామర్ గేట్లు ఎత్తేసి కవ్విస్తుంది. ఈ మధ్య కాలంలో రాశిఖన్నా పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే కుర్రకారుకు నిద్ర పట్టడం లేదు. ఆ రేంజ్ లో అందాలతో అదరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తాజగా రాశిఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కమర్షియల్ చిత్రాలు మాత్రమే కంటెంట్ ఉన్న సినిమాల్లోనటించడం తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.

ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. ‘నాకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. కమర్షియల్ సినిమాలంటే వెంటనే ఓకే చెప్పేస్తా..  కానీ అలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. అలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. నేను నటిగా ఎదగాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా..  మంచి కంటెంట్‌ ఉన్న సినిమాల్లో అవకాశం వస్తే ఆ సినిమానే మన ఎదుగుదలకు కారణం అవుతుంది. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి మరో అవకాశం దక్కుతుంది. అలాంటి సినిమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా. చాలా కాలంగా సౌత్‌లో సినిమాలు చేస్తున్నా.. కానీ అలాంటి చిత్రాలే హిందీలో చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్‌ ఉండదు అని రాశిఖన్నా చెప్పుకొచ్చింది..

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.