Most Recent

Pradeep Ranganathan: అమ్మబాబోయ్ అన్ని కోట్లా..! రెమ్యునరేషన్ పెంచేసిన లవ్ టుడే హీరో

Pradeep Ranganathan: అమ్మబాబోయ్ అన్ని కోట్లా..! రెమ్యునరేషన్ పెంచేసిన లవ్ టుడే హీరో

లవ్ టుడే సినిమా గుర్తుందా.? తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. నేటి యువతను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్, తెలుగు రెండు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడున్న జనరేషన్ కు తగ్గ కథ ఇది.. ప్రేమలో ఉన్న అమ్మాయి అబ్బాయి తమ ఫోన్లు మార్చుకునే ఏం జరుగుతుంది అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా యూత్ ను ఆకట్టుకోవడంతో తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఇవానా కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. అలాగే ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రదీప్ రంగనాథన్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రదీప్ రంగనాథన్ నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా.. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ హీరోగా డ్రాగన్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే 2 సినిమాలు తెరపైకి రానున్నాయి. ఈ సందర్భంలో, డ్రాగన్ చిత్రం ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదల కానుంది. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ గోట్ మూవీని నిర్మించిన AGS నిర్మించింది. ఈ చిత్రంలో ఆయన సరసన అందాల భామలు అనుపమ పరమేశ్వరన్, కయ్యదు లోహర్ ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వీరితోపాటు వారితో కె.ఎస్. రవికుమార్, మైష్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి నటించారు. ఈ సినిమా పూర్తిగా లవ్, రొమాన్స్, యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన వరుసగా సినిమాలను లైనప్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే రెమ్యునరేషన్ కూడా పెంచేశాడట. తను నటించబోయే సినిమాలకు 18 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ప్రదీప్ కు క్రేజ్ ఉంది ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పు లేదు అని కొందరు కోలీవుడ్ తంబీలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.