Most Recent

Game Changer Twitter Review: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

Game Changer Twitter Review: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా గేమ్ ఛేంజర్. గ్లోబల్ రామ్ చరణ్, బాలీవుడ్ యాక్ట్రెస్ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో ఈమూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూశారు. ఇందులో అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలకపాత్రలు పోషించగా.. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక తమన్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఈరోజు (జనవరి 10న) అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోస్ ప్రదర్శించగా… ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు నెటిజన్స్.

శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని నెటిజన్స్ పోస్టులు చేస్తున్నారు. అటు అప్పన్నగా, ఇటు ఐఏఎస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ మరోసారి అద్భుతమైన యాక్టింగ్ తో అదరగొట్టేశాడని అంటున్నారు. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అప్పన్న క్యారెక్టర్స్ కు సంబంధించి వచ్చే సీన్స్ లో రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు.

ఫస్ట్ హాప్ లో చరణ్ ఇంట్రడక్షన్ తోపాటు ధూప్ సాంగ్, బీజీఎమ్, ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా ఉంటాయని.. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక చాలా కాలం తర్వాత శంకర్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్, రేసీ స్క్రీన్ ప్లే తో గేమ్ ఛేంజర్ మూవీ సాగుతుందని.. ఇది శంకర్ సాలిడ్ కంబ్యాక్ మూవీ అంటున్నారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.