నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డాలస్‌లో గ్రాండ్ స్కేల్‌లో జరిగింది. టెక్సాస్ ట్రస్ట్ థియేటర్ వేదికగా థియేటర్ ట్రైలర్ లాంచ్ చేసింది మూవీ టీమ్. ఈ వేడుకకు నందమూరి అభిమానులు భారీగా హాజరై జై బాలయ్య స్లోగన్స్‌తో హోరెత్తించారు. బాబీ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన డాకు మహరాజ్ చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా నటించారు. వారిద్దరితోపాటు శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కూడా నటించారు. ఈ ట్రైలర్లో అన్ని అంశాలు జోడించే ప్రయత్నం చేశారు.. యాక్షన్, ఎమోషన్ అన్ని సమ పాళ్లలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో కింగ్ ఆఫ్ జంగిల్ అంటూ బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయేలా చేశాయి.. ప్రతినాయకుడిగా బాబీ డియోల్ అంచనాలను మరింత పెంచారు..
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా డాకూ మహారాజ్ సినిమా ట్రైలర్ అదిరిపోయింది.. బాబీ డైరెక్షన్.. బాలయ్య యాక్షన్, తమన్ సంగీతం డాకు మహారాజ్ అంచనాలను మరింత పెంచింది..
ట్రైలర్ చూడండి..
మూడు డిఫరెంట్ లుక్స్‌లో బాలయ్య కనిపించనున్నారు.. సంక్రాంతి విన్నర్ బాలయ్యే అంటూ బాబీ అంటుండగా.. ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని బాలయ్యను చూస్తారంటూ సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు.. 2025లో బ్లాక్ బస్టర్ ఖాయమంటూ మూవీ యూనిట్ పేర్కొంటుండటం.. అటు ట్రైలర్ కూడా అదిరిపోయేలా ఉండటం సినిమా అంచనాలను మరింత పెంచింది.
డాకు మహరాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చూన్ ఫోర్ సినిమాతో కలిసి సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించింది.. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న డాకు మహరాజ్ చిత్రం రిలీజ్ కానుంది. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్రయూనిట్ తోపాటు.. అభిమానులు భారీగా హాజరయ్యారు.. డాకు మహరాజ్‌ను అమెరికాలో శ్లోక ఎంటర్‌టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.