సినిమాలో పాత్రల కోసం హీరోయిన్స్ చాలా కష్టపడుతూ ఉంటారు. కథకు తగ్గట్టుగా తమ బాడీని మార్చుకుంటూ ఉంటారు. అలాగే అందంగా కనిపించడానికి ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది భామలు అందంగా కనిపించడానికి సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇలా సర్జరీలు చేయించుకొని అందాన్ని పెంచుకున్నవారే.. కొంతమంది బరువు తగ్గడానికి సర్జరీలు చేయించుకున్నారు. మరికొంతమంది పెదవులు, ముక్కు ఇలా కొన్ని అవయవాలకు సర్జరీ చేయించుకున్నారు. తాజాగా ఓ హీరోయిన్ జుట్టు కోసం స్టెరాయిడ్ ఇంజక్షన్లు తీసుకుంటుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలిపింది. అంతే కాదు వీడియోను కూడా షేర్ చేశారు.
నటి షాన్ రోమీ తన అభిమానులకు ఓ షాకింగ్ విషయం చెప్పింది. గడిచిన ఏడాది తనకెంతో కష్టంగా గడిచిందంటోంది హీరోయిన్ షాన్ రోమీ. నా ఆటో ఇమ్యూన్ బాగా తగ్గిపోయింది అని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. 2024 నాకు కొంత దారుణమైన సంవత్సరం. నన్ను బాధపెట్టిన ఆటో-ఇమ్యూన్ పరిస్థితి వచ్చింది. నేను కొన్ని విషయాలను విడిచిపెట్టి, మరికొన్నింటిని దేవునికి ఇవ్వవలసి వచ్చింది. నాజుట్టు ఊడిపోవడం మొదలైంది. ఈ సమస్యకు నా స్నేహితురాలు ఓ సలహా ఇచ్చింది. దేవుడు నా కోసమే ఆమెను నా దగ్గరకు పంపించాడు. ఆమె ఒక నెలలోపు వెంట్రుకలు తిరిగి వస్తాయని చెప్పింది. తాను చెప్పిందే జరిగింది అని తెలిపింది.
ప్రతి నెలా, రెండు వారాలకోసారి స్టెరాయిడ్ ఇంజక్షన్లు తీసుకోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆగస్టు నుండి ప్రతి నెలా ఇంజక్షన్లు తీసుకున్నాను. నేను వర్కవుట్ చేయడానికి లేదా ఏదైనా కష్టమైన పని చేయడానికి భయపడ్డాను. నా బడీ సహకరించలేదు. ముందు నేను ప్రశాంతంగా ఉండాలనుకుని గోవాకు వెళ్లిపోయాను. ఆతర్వాత మెల్లగా కోలుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.ఇక ఈ ముద్దుగుమ్మ లూసిఫర్, హృదయం, బ్లూ స్కైస్ -గ్రీన్ వాటర్స్ -రెడ్ ఎర్త్ సినిమాలు చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి