Most Recent

పెళ్లికి ముందే తల్లైంది.. ఆతర్వాత పెళ్ళైంది.. ఇప్పుడు తనకన్నా చిన్నవాడితో డేటింగ్

పెళ్లికి ముందే తల్లైంది.. ఆతర్వాత పెళ్ళైంది.. ఇప్పుడు తనకన్నా చిన్నవాడితో డేటింగ్

లవ్ స్టోరీలు, బ్రేకప్ లు, ఎఫైర్స్, పెళ్లి, విడాకులు ఇవి చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. కానీ సెలబ్రెటీల విషయంలో జరిగితే మాత్రం అది వార్తే ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్. జనాలు సెలబ్రెటీల లైఫ్ లో జరిగే ప్రతి దాని పై ఓ కన్నేసి ఉంటారు. ఇక సినిమా ఇండస్త్రీలో రిలేషన్స్ షిఫ్స్ గురించి నిత్యం వార్తలు వింటూనే ఉంటాం. హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్.. కొంతమంది ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకున్న భామలు కూడా ఉన్నారు. అలాగే ఇంకొంతమంది ముగ్గురు నలుగురితో లవ్ ట్రాక్స్ నడిపి ఆతర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకున్న వారు లేకపోలేదు. కాగా వీలందరిలో ఈ అమ్మడు కాస్త డిఫరెంట్.. పెళ్ళికి ముందే తల్లయ్యింది.. ఆతర్వాత పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు భర్తతో విడిపోయి.. తనకన్నా వయసులో చిన్నవాడితో ఎఫర్ నడుపుతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆమె ఓ క్రేజీ హీరోయిన్ కానీ స్టార్ డమ్ అందుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నా.. స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. ఆతర్వాత పెళ్లి చేసుకుంది పెళ్లైన 10ఏళ్ల కు విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తనకన్నా వయసులో ఏడేళ్లు చిన్నవాడితో రిలేషన్ లో ఉంది. ఆమె మరెవరో కాదు కొంకణ సేన్ శర్మ. బాలీవుడ్ లో ఈ చిన్నది చాలా పాపులర్. ఆమె నటి అపర్ణా సేన్ కుమార్తె. కొంకణ సేన్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది.

బెంగాలీ, హిందీ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది అలాగే ఇంగ్లిష్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ నటించి మెప్పించింది . అలాగే వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. అలాగే దర్శకురాలిగాను చేసింది కొంకణ సేన్ శర్మ. కొంకణా 2007లో రణవీర్ షోరేతో డేటింగ్ చేసింది. పెళ్ళికి ముందే కొంకణ ప్రెగ్నెంట్ అయ్యింది. 2010లో రణ్‌వీర్‌, కోంకణా పెళ్లి చేసుకున్నారు. 2011 సంవత్సరంలో, కొంకణా కొడుకు హరూన్‌కు పుట్టాడు. ఇక పెళ్లైన పదేళ్ల తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఇక ఇప్పుడు మరో వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. అమోల్ పరాశర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొంకణా కంటే 7 సంవత్సరాలు చిన్నవాడు. ఇది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Konkona Sensharma (@konkona)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.