Most Recent

Balakrishna: బాలయ్యకు పద్మ భూషణ్.. ఎన్టీఆర్, చిరంజీవి శుభాకాంక్షలు.. ఎవరెవరూ విష్ చేశారంటే..

Balakrishna: బాలయ్యకు పద్మ భూషణ్.. ఎన్టీఆర్, చిరంజీవి శుభాకాంక్షలు.. ఎవరెవరూ విష్ చేశారంటే..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీరంగంలో విశేషమైన సేవలు అందించినందుకుగానూ నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే బాలకృష్ణ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, వెంకటేశ్ వంటి స్టార్స్ బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. “ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన బాల బాబాయ్ కు హృదయపూర్వక అభినందనలు. ప్రజాసేవకు, సినిమా రంగానికి మీరు చేసిన ఎనలేని సేవలకు గుర్తింపుగా దక్కిన గౌరవం” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

“ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న నా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ సన్మానం సినిమా ప్రపంచానికి మీరు చేసిన విశేషమైన సేవలకు మరియు సమాజానికి సేవ చేయడంలో మీ నిర్విరామ కృషికి నిజమైన గుర్తింపు.” అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ ట్వీట్..

కళ్యాణ్ రామ్ ట్వీట్..

” అన్ స్టాపబుల్ యాక్టర్, లీడర్, సమాజ సేవకుడు నందమూరి బాలకృష్ణగారు పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు. దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారం అందుకోవడం గర్వంగా ఉంది. తెలుగు సినిమా రంగానికి, అశేషమైన అభిమాన లోకానికి నిజమైన అన్ స్టాపబుల్ మూమెంట్స్” అంటూ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.