ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తే తమకు సమచారాం ఇవ్వాలని ఇప్పటికే రామ్ గోపాల్ పేట్ పోలీసులు బన్నీకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు తాను కిమ్స్ హాస్పిటల్‌కు వస్తున్నట్లు రామ్ గోపోల్ పేట్ పోలీసులకు తెలియజేశారు అల్లు అర్జున్. పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకుని ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లనున్నారు.
ఇదిలా ఉంటే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. అదే ఘటనలో బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరచగా.. హైకోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఇటీవలే నాంపల్లి కోర్టు బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ పేట పోలీసుల అనుమతి తీసుకుని ఈరోజు ఉదయం 10 గంటలకు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారు అల్లు అర్జున్.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.