Most Recent

Tollywood: ‘5-10 మంది పిల్లలనైనా కనాలనుంది’.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: ‘5-10 మంది పిల్లలనైనా కనాలనుంది’.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన.. ఎవరో గుర్తు పట్టారా?

సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి హఠాత్తుగా కనుమరుగైన హీరోయిన్లలో సనా ఖాన్‌ ఒకరు. కల్యాణ్ రామ్ కత్తి, నాగార్జున గగనం, మంచు మనోజ్‌ మిస్టర్‌ నూకయ్య సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయమే. అయితే 2019లో దుబాయ్ కు చెందిన ముస్లిం మతగురువు, వ్యాపార వేత్త ముఫ్తీ అనస్ సయ్యద్ ను సనాఖాన్ వివాహం చేసుకుంది. అంతకు ముందే సినిమాలకు గుడ్ చై చెప్పేసిన ఈ అందాల తార పెళ్లి తర్వాత దుబాయ్‌ వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది.సనాఖాన్, అనస్ సయ్యద్ దంపతులకు 2023లో ఒక పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి అమ్మగా ప్రమోషన్ పొందనుంది.  కొద్ది రోజుల క్రితం ఆమె తన అభిమానులకు ఈ ‘శుభవార్త’ అందించింది. సనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ప్రెగ్నెన్సీ గురించి వివిధ విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఓ వీడియోలో 5-10 మంది పిల్లలకు జన్మనివ్వాలనే కోరికను సనా వ్యక్తం చేసింది. దీనిపై నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌పై కూడా సనా అభిప్రాయాలను నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు.

ఈ వీడియోలో, సనా మాట్లాడుతూ, “నేను ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మినివ్వాలనుకుంటున్నాను. ఆ సంఖ్య ఐదు కావొచ్చు.. పది కావొచ్చు.. పూర్వ కాలంలో మహిళలు 12-12 మంది పిల్లలకు ప్రసవించే వారట. నేను గర్భం ధరించినప్పటి నుంచి నా భర్త అనాస్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. బిడ్డ ప్రసవించే వరకు కంటికి రెప్పలా నా వెంటే ఉంటున్నాడు’ అని సనా చెప్పుకొచ్చింది. ఇక పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌పై కూడా సనా తన అభిప్రాయాలను పంచుకుంది. ‘మీరు ఇలాంటి డిప్రెషన్ల నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మికత వైపు మళ్లేందుకు ప్రయత్నించండి’ అని సనా సలహా ఇచ్చింది.

సనా వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ’10-12 మంది పిల్లలకు జన్మనివ్వడం అంత తేలికేనా?’ అని ఒకరు అడిగారు. “పని చేయడానికి నానీలు, పనిమనిషి ఉన్నప్పుడు మీరు ఈ విషయాలన్నీ చెప్పడం చాలా సులభం,” మరొకరు అన్నారు. ‘ఇంత జనాభా ఉన్న భారత్‌లో పది, పన్నెండు మంది పిల్లలకు జన్మనివ్వడం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడాలి’ అని ఇంకొకరు సనాపై మండిపడ్డారు.

సనా ఖాన్ భర్త గుజరాత్‌లోని సూరత్. ముఫ్తీ అనస్ సయ్యద్ ఒక మత నాయకుడు, ఇస్లామిక్ పండితుడు. సనా ఎజాజ్ ఖాన్ ద్వారా ముఫ్తీకి పరిచయమైంది. ముఫ్తీ అనాస్ కూడా వ్యాపారవేత్త. నికాహ్ తర్వాత, అతను సనాకు ప్రత్యేకమైన డైమండ్ రింగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. సనా ఖాన్ తన విలాసవంతమైన జీవనశైలితో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అనాస్‌తో పెళ్లయ్యాక కూడా విదేశాల్లో చాలా ఖరీదైన రెస్టారెంట్లు, వివిధ ప్రదేశాలను సందర్శిస్తూనే ఉంది.

సనా ఖాన్ షేర్ చేసిన వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.