Most Recent

Pawan Kalyan : ఆయన గురించి తెలిసి ఆశ్చర్యపోయా..! శ్యామ్ బెనెగల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ఆయన గురించి తెలిసి ఆశ్చర్యపోయా..! శ్యామ్ బెనెగల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది లెజెండ్రీ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ సోమవారం( 23 న ) కన్ను మూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు శ్యామ్ బెనగల్. దానికి తోడు వృద్ధాప్య సమస్యలు కూడా ఉండటంతో ఆయన కన్నుమూశారు. శ్యామ్ బెనగల్ మృతికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రముఖులు రాసుకొచ్చారు. అలాగే శ్యామ్ బెనగల్ మృతి ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.

ఇది కూడా చదవండి : మెంటల్ మాస్ మావ.! ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

“వాస్తవిక పరిస్థితులకు అద్దంపట్టే కథలను వెండి తెరపై ఆవిష్కరించిన ప్రముఖ దర్శకులు శ్రీ శ్యామ్ బెనెగల్ గారు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ శ్యామ్ బెనెగల్ గారు తెరపై చూపించిన పాత్రలు సమాజంలోని పరిస్థితులకు ప్రతిబింబాలుగా ఉండేవి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఇది కూడా చదవండి :17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యింది.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్.. ఆ తప్పులే కారణం

అలాగే “అమూల్ పాల రైతులు రూ.2 చొప్పున ఇస్తే 1976లోనే క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకొని మంథన్ అనే సినిమాను ఆయన రూపొందించారని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. అంకుర్, నిశాంత్, భూమిక, మండి, మంథన్ లాంటి చిత్రాలతో భారతీయ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక శైలిని చూపించారు. శ్రీ శ్యామ్ బెనెగల్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని పవన్ అన్నారు. కాగా సత్యజిత్‌రే తర్వాత ఆర్ట్‌ ఫిల్మ్స్‌లో సత్తా చాటిన దర్శకులలో శ్యామ్ బెనగల్ ఒకరు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో పాటు ఏడుసార్లు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు శ్యామ్. శ్యామ్ మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి :పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ భామ.. విడాకులు తీసుకున్న వ్యక్తితో వివాహం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.