Most Recent

Game Changer: ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే.. దేశంలోనే అతిపెద్ద కటౌట్ నేడు ఆవిష్కరణ.. ఎక్కడంటే?

Game Changer: ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే.. దేశంలోనే అతిపెద్ద కటౌట్ నేడు ఆవిష్కరణ.. ఎక్కడంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. తెలుగమ్మాయి అంజలి మరో కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయ వాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు అభిమానులు. గేమ్ ఛేంజర్ సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో ఆదివారం (డిసెంబర్‌ 29)న మధ్యాహ్నం 3 గంటలకు చిత్ర యూనిట్‌ ఈ బిగ్గెస్ట్ కటౌట్ ను ఆవిష్కరించనుంది. వేడుకల్లో భాగంగా హెలికాప్టర్‌తో రామ్ చరణ్ కటౌట్‌కి పూలభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం హాజరు కానుంది. అలాగే రామ్ చరణ్ అభిమానులు భారీగా రానున్నారు.

కాగా సుమారు 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్‌ సినిమాలో రామ్ చరణ్ లుక్‌తో కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అతి పెద్ద కటౌట్‌ అని మెగా అభిమానులు చెబుతున్నారు. ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసేందుకు సుమారు ఐదురోజుల పాటు అభిమానులు కష్టపడ్డారు. కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహణ కోసం పూర్తి అనుమతులు తీసుకున్నట్లు రామ్​ చరణ్‌ అభిమానులు ప్రకటించారు.

నేడు విజయవాడలో ఆవిష్కరణ..

కాగా తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో  గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి  రిలీజ్ చేసిన జరగండి, రా మచ్చా మచ్చా, నా నా హైరానా, ధోప్ అనే పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో నిలిచాయి.

రేపు అనంత పురంలో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.