Most Recent

CM.Revanth Reddy: సీఎం. రేవంత్ రెడ్డి ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు ఊహించలేరు గురూ..

CM.Revanth Reddy: సీఎం. రేవంత్ రెడ్డి ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు ఊహించలేరు గురూ..

సినిమా ఇండస్ట్రీ విత్‌ సీఎం. కాసేపట్లో జరిగే ఈ స్పెషల్‌ మీటింగ్‌ అటు రాజకీయ, ఇటు సినీవర్గాల్లో ఆసక్తిరేపుతోంది. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. ఉదయం10 గంటలకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. FDC చైర్మన్‌ దిల్‌రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరు అవుతారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, సునీల్‌ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ హాజరవుతారు. ముఖ్యమంత్రితో సమావేశానికి హీరోల తరపున వెంకటేష్‌, నితిన్‌, వరుణ్‌ తేజ్‌, కిరణ్‌ అబ్బవరం, శివబాలాజీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక దర్శకుల నుంచి వీరశంకర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, సాయిరాజేష్‌, హరీష్‌ శంకర్, అనిల్‌, బాబీ, వంశీ వస్తారని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి : కామన్ మ్యాన్‌లా స్కూటీపై తిరుగుతున్న ఈ సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆయన చాలా ఫెమస్

ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన పరిణామాలు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయాల పై సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డితో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి అభిమాన హీరో ఎవరు అంటూ.. సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. కాగా గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో తన ఫేవరెట్ హీరో గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! స్టార్ హీరోయిన్స్ బీట్ చేసేలా అజిత్ కూతురు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన అభిమాన హీరో గురించి మాట్లాడుతూ.. ఇప్పుడైతే సినిమాలు పెద్దగా చూడటం లేదు కానీ అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ తన ఫేవరెట్ హీరో అని చెప్పారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కృష్ణ సినిమాలు బాగా చేసేవాడిని అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

Revanth Reddy, Super Star K

రేవంత్ రెడ్డి అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ

 

View this post on Instagram

 

A post shared by Jagadeesh Editz (@jagadeesh_editz_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.