భారీ అంచనాల మధ్య మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది కల్కి 2898 ఏడీ. ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్.. ఇటీవల ముంబై వేదిక కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణెలను కూర్చొబెట్టి కల్కి సినిమాపై ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ చేశారు రానా దగ్గుబాటి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు మరో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఇప్పటికే సెకండ్ ట్రైలర్‌కు సంబంధించ లీకైన విజువల్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. దీంతో కల్కి సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదలకు వారం రోజుల ముందు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.
ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వైజయంతీ మూవీస్ ట్విట్టర్ ద్వారా ఓ పోస్టర్ షేర్ చేస్తూ అసలు విషయం చెప్పేశారు. అలాగే ఈ సినిమాలో బుజ్జి అనే కారు కూడా హైలెట్ కానుంది. ఓవైపు ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతుండగా.. మరోవైపు విదేశాల్లో కల్కి టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అమెరికాతోపాటు యూకేలో బుకింగ్స్ విషయంలో విశేష ఆదరణ లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కల్కి ప్రీ బుకింగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సెన్సార్ టాక్, రన్ టైమ్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమమాకు సెన్సార్ రివ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. నెట్టింట వినిపిస్తున్న సమాచారం ప్రకారం కల్కి సినిమాకు సెన్సార్ టాక్ అదిరిపోయిందని అంటున్నారు. ఈ సినిమా దాదాపు మూడు గంటలు ఉంటుందని.. అలాగే విజువల్స్, ఎలివేషన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయని అంటున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ సరికొత్తగా ప్లాన్ చేశారు మేకర్స్. ఓవైపు దేశమంతా ప్రభాస్ బుజ్జి చక్కర్లు కొడుతుండగా.. మరోవైపు కల్కి స్టోరీ రివీల్ చేస్తూ రోజుకో వీడియో షేర్ చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించానని.. మొత్తం మూడు ప్రపంచాల చుట్టూ తిరుగుతుందని..కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే ప్రాంతాలు, వరల్డ్ ల చుట్టూ ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్, శోభన, దీపికా, దిశా పటానీ, అమితాబ్, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.600 కోట్లతో నిర్మించిన ఈ మూవీ మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.