‘కల్కి 2898 ఏడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్స్ పరంగాను రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు గడుస్తున్నా భారతీయ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల వసూళ్ల దిశగా అడుగులు వేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు భారీగానే రాబడుతున్నాయి. నాలుగో రోజు ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.85 కోట్లు వసూల్ చేసింది.ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’లో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇలా స్టార్ కాస్ట్ నటించిన కల్కి సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదలైంది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ఇండియాలో రూ. 302 కోట్లు వసూలు చేసింది. ఆదివారం నాటికి ఈ సినిమా రూ.85 కోట్లు కోట్ల రూపాయలను రాబట్టింది.
‘కల్కి 2898 ఏడీ’ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.415 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజు 500కోట్లు వసూల్ చేసింది. దాంతో కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు రూ.500 కోట్లు దాటుతాయి. ఇక కల్కి సినిమాను మహాభారత నేపథ్యంలో తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రతో పాటు అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. కల్కి సినిమాను మరికొన్ని పార్టులుగా తెరకెక్కించనున్నాడు దర్శకుడు.
సినిమాకి రెండో పార్ట్ ఉందని హింట్ ఇస్తూ..క్లైమాక్స్ ను ఎండ్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో భాగం షూటింగ్ జరుగుతోంది. 60 పూర్తయినట్లు ఇటీవలే నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. అలాగే కల్కి సినిమా వెయ్యి కోట్లు వసూల్ చేయడం పెద్ద కష్టమేమి కాదు అంటున్నారు విశ్లేషకులు.
Thank you Abhishek Ji!! #Kalki2898AD https://t.co/bsIWexsBpg
— Kalki 2898 AD (@Kalki2898AD) June 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.