-
నార్త్ సినిమాలకు బిజినెస్ గట్టిగా జరగాలంటే సౌత్ టచ్ ఉండాల్సిందేనని నమ్ముతున్నారు మేకర్స్. అయితే హీరోలు, లేకుంటే విలన్లుగా మనవారిని అప్రోచ్ అవుతున్నారు. ఈ రెండు విషయాల సంగతి ఎలా ఉన్నా.. సౌత్ నుంచి గ్లామర్ టచ్ మాత్రం కోరుకుంటున్నారు... ఈ ట్రెండ్‌లో అవకాశాలు కొల్లగొట్టేస్తున్న మన హీరోయిన్లు ఎవరు? చూసేద్దాం రండి....
-
నేషనల్ క్రష్ రష్మికకు సినిమాల్లో నేషనల్ పర్మిట్ ఎప్పుడో వచ్చేసింది. దానికి తోడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ క్లిక్ కావడంతో ఓవర్‌నైట్‌లో క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు సల్మాన్‌తో సికిందర్ చేసినా, విక్కీ కౌశల్‌తో చావా చేసినా అదంతా ఈ క్రేజ్ చలవే. నార్త్ లో పూజా హెగ్డేకి సూపర్‌డూపర్ హిట్ అంటూ ఇప్పటిదాకా స్పెషల్‌గా ఏమీ లేకపోయినా, సౌత్‌లో ఆమెకున్న పేరును కన్సిడర్ చేస్తూ అవకాశాలు మాత్రం బాగానే ఇస్తున్నారు నార్త్ మేకర్స్.
-
సౌత్‌లో పక్కింటమ్మాయిగా రౌడీ బేబీ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న లేడీ పవర్‌స్టార్ సాయపల్లవి. నార్త్ ఇండస్ట్రీలో ఏకంగా ఒకటికి రెండు సినిమాలతో అడుగుపెడుతున్నారు. రామాయణం ఓ వైపు, అమీర్‌ఖాన్ కొడుకుతో చేస్తున్న సినిమా ఇంకో వైపు. రెండూ క్రేజీ ప్రాజెక్టులు కాబట్టి, ఈ భామ మరిన్ని సినిమాలకు సైన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు క్రిటిక్స్.
-
సాయిపల్లవినే ఫాలో అవుతున్నారు కీర్తీ సురేష్. అట్లీ భార్య ప్రియ ప్రొడ్యూస్ చేస్తున్న బేబీ జాన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు కీర్తీ సురేష్. ఈ మూవీతో అక్కడ ప్రూవ్ చేసుకుంటే, నార్త్ లో కీర్తి జెండా రెపరెపలాడటం ఖాయం అన్నది నియర్ అండ్ డియర్స్ మాట.
-
ఇంత మంది నార్త్ వైపు దూసుకుపోతుంటే నేను మాత్రం ఎందుకు ట్రై చేయకూడదని అనుకున్నట్టున్నారు శ్రీలీల. సౌత్‌లో అనతికాలంలోనూ వండర్ఫుల్ హీరోయిన్ అని పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ, త్వరలోనే నార్త్ ప్రాజెక్టు కోసం మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు.